కొన్ని సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ లు నిలిస్తే అందులో లోటు పాట్లు పెద్దగా పట్టించుకోం. లాజిక్ లని అసలే లెక్కలోకి తీసుకోం. కానీ ఓ సినిమా అవే లాజిక్ లని బయట పడేస్తూ వుంటుంది. ఆలోచన రేకెత్తిస్తుంటుంది. అవును కదా ఇ అందులో మిస్సయిందే అని నాలుక కరుచుకుంటాం. అది బ్లెండర్ మిస్టేక్ కదా అని ఆ తరువాత అనుకుంటాం. ఇంత చిన్న లాజిక్ ని సీనియర్ డైరెక్టర్ ఎలా మిస్సయ్యాడబ్బా అని ఆరాలు తీస్తాం. కొత్త చర్చకు తెరలేపుతాం.
సరగ్గా ఇలాంటి పనే రవితేజ సినిమా తాజాగా చేసింది. మాస్ మహారాజా రవితేజ నటించిన లేటెస్ట్ యాక్షన్ ఎంటర్ టైనర్ `రామారావు ఆన్ డ్యూటీ`. శరత్ మండవ డైరెక్ట్ చేసి ఓ రేంజ్ లో ప్రచారం చేసిన ఈ మూవీ శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఫ్యాన్స్ ని తీవ్రంగా నిరాశ పరిచింది. సినిమా చూసిన ఫ్యాన్స్ ఓ రేంజ్ లో దర్శకుడిపై విమర్శలు చేస్తున్నారు. కంటెంట్ సరిగా లేదని మండి పడుతున్నారు. తలా తోకా లేని కథతో సినిమా చేశావంటూ సెటైర్లు వేస్తున్నారు.
ఫస్ట్ డే ఫస్ట్ షో నుంచే ఈ మూవీకి డిజాస్టర్ టాక్ బయటికి వచ్చేసింది. స్లో ననేషన్ అంటూ కామెంట్ లు చేస్తున్నారు. ఎర్రచందనం నేపథ్యంలో ఈ మూవీని రూపొందించారు. తప్పిపోయిన వ్యక్తులు వారి వెనకున్న ఎర్రచందనం స్లగ్లర్ ల నేపథ్యంలో సాగే సినిమా ఇది. ఇదే తరహాలో ఎర్ర చందనం నేపథ్యంలో `పుష్ప` మూవీ రూపొందిన విషయం తెలిసిందే. ఈ సినిమాతో పోలీస్తే `రామారావు ఆన్ డ్యూటీ` చాలా విషయాల్లో పట్టుకోల్పోయినట్టుగా కనిపించింది.
కానీ ఒక్క విషయంలో మాత్రం `పుష్ప`ని అడ్డంగా ఇరికించింది. సినిమాలో ఎర్రచందనం దుంగలని నీటిలో పడేస్తే అవి మునిగిపోతాయి అని దర్శకుడు శరత్ మండవ చూపించాడు. కారణం నీటిలో మునిగే ఒకే ఒక్క దుంగ ఎర్రచందనం కాబట్టి.
అయితే ఈ లాజిక్ ని `పుష్ప` దర్శకుడు సుకుమార్ మిస్సయ్యాడు. సినిమాలోని ఓ కీలక ఘట్టంలో బన్నీ ఓ చోట వున్న దుంగలని పోలీసులు వస్తున్నారని తెలియడంతో నదిలో పడేస్తాడు. అవి చివరికి రిజర్వాయర్ డ్యామ్ కు చేరుకోగానే అక్కడున్న వ్యక్తికి డబ్బులిచ్చి డ్యామ్ గేట్లు మూయించేస్తాడు. దీంతో ఎర్ర చందనలు దుంగలన్నీ కొట్టుకుంటూ వచ్చి డ్యామ్ దగ్గరే ఆగిపోతాయి.
`పుష్ప`లోని హైలైట్ సీన్ లలో ఇదీ ఒకటి. అయితే `రామారావు ఆన్ డ్యూటీ` నీటిలో ఎర్రచందనం దుంగ మునిగిపోతుందని చెప్పడంతో `పుష్ప` టీమ్ ని అడ్డంగా ఇరికించిందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో పాన్ ఇండియా వైడ్ గా బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఈ మూవీకి సీక్వెల్ గా రానున్న సినిమాలో అయినా సుకుమార్ ఇలాంటి లాజిక్ లపై జాగ్రత్తపడతారని అంటున్నారు.