తిరుమలలో ఫుల్ స్టాప్ పెట్టేసిన రంభ

Update: 2017-04-11 04:50 GMT
గత తరం సెక్సీ బ్యూటీ రంభ అలియాస్ విజయలక్ష్మి.. ప్రస్తుతం తిరుమల సందర్శించింది. నిన్న తిరుమల వేంకటేశ్వరుని సన్నిధికి కుటుంబంతో సహా వచ్చింది రంభ. భర్త.. ఇద్దరు ఆడపిల్లలతో సహా వచ్చి శ్రీనివాసుని ఆశీర్వాదాలు పొందారు ఈమె కుటుంబం.

సెలబ్రిటీలు ఇలా తిరుమల చేరుకోవడం తరచుగా జరిగేదే కానీ.. రంభ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఈమె తన భర్త ఇంద్రకుమార్ తో కలిసి రావడమే అసలైన విషయం. ఎందుకంటే.. ఓ ఏడాదిగా వీరిద్దరూ బోలెడన్ని మాటలు అనేసుకున్నారు. కోర్టు మెట్లెక్కి విడాకులు కూడా అప్లై చేసేశారు. తన భర్త నుంచి నెలకు 2.5 లక్షల రూపాయల భరణం ఇప్పించాలంటూ.. రంభ నానా యాగీ చేసింది కూడా. సాఫ్ట్ వేర్ ఇంజినీర్ అయిన ఇంద్రకుమార్ ఈ విషయంలో పెద్దగా నోరు మెరిపలేదు. అయితే.. ఇప్పుడు మళ్లీ సిట్యుయేషన్ మారిపోయింది.

రీసెంట్ గా వీళ్లిద్దరూ తమకు విడాకులు అవసరం లేదంటూ కోర్టుకు చెప్పేశారు. తమ మధ్య విబేధాలను తొలగించుకున్నామని చెప్పి.. ఇకపై కలిసి ఉండాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు కూడా. ఆ తర్వాతే ఇలా కలిసి తిరుమల రావడంతోనే.. రంభ తన డైవర్స్ ఇష్యూకు ఫుల్ స్టాప్ పెట్టేసినట్లయ్యింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News