చెర్రీ-రానా దోస్త్ లు మ‌ల్టీస్టార‌ర్ చేసేదెపుడు?

Update: 2022-01-03 01:30 GMT
మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్-టాలీవుడ్ హంక్ రానా  బాల్యం నుంచి స్నేహితులు అన్న సంగ‌తి తెలిసిందే.  స్కూల్ డేస్ లోనే ఇద్ద‌రు ప్రెండ్స్. చెన్నైలో ఒకే స్కూల్ చ‌దివారు. ఇరు కుటుంబాల న‌డుమా ద‌శాబ్ధాల సాన్నిహిత్యం ఉంది. దాదాపుగా 30 ఏళ్లుగా స్నేహితులుగా నే ఉన్నారు. తాజాగా  వీరిద్ద‌రు క‌లిసి దిగిన ఓ ఫోటోగ్రాఫ్ నెట్టింట వైర‌ల్ గా మారింది. ఇన్ స్టా గ్రామ్ లో  రానా ఈ ఫోటోని షేర్ చేసాడు. ``30 ఏళ్లుగా క‌లిసే.. హ్యాపీ న్యూ ఇయ‌ర్ మ్యాన్` అని వ్యాఖ్య‌ను జోడించారు రానా. ఈ ఫోటో చూసి ఇద్ద‌రి హీరోల అభిమానులు ఫిదా అవుతున్నారు. మొత్తానికి జ‌న‌రేష‌న్ ఛేంజ్ చాలా మార్పులు తీసుకొచ్చింది.

ఒక‌ప్పుడు హీరోల మ‌ధ్య ఈగో ఫీలింగ్స్ ఎక్కువ‌గా ఉండేవి. నువ్వెంత అంటే నువ్వెంత? అనే పోరు క‌నిపించ‌కుండానే ఉండేది. ఆ కార‌ణంగా అభిమాన సంఘాల మ‌ధ్య వివాదాలు బ‌య‌ట‌ప‌డేవి. అయితే ఇప్పుడు పూర్తిగా ఛేంజ్ అయింది. హీరోల మ‌ధ్య  ఆరోగ్య‌క‌ర‌మైన వాతావ‌ర‌ణం ఉంటుంది. ఒకరి సినిమా ప్ర‌మోష‌న్ల‌కు మ‌రొక‌రు హాజ‌ర‌వుతున్నారు. పోటాపోటీగా సినిమా రిలీజ్ లు లేకుండా ఒకరికి ఒక‌రు సాయం చేసుకుంటున్నారు.  ప్ర‌స్తుతం చ‌ర‌ణ్...రానా త‌మ సినిమాల్లో బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే. చ‌ర‌ణ్  పాన్ ఇండియా చిత్రం  `ఆర్ ఆర్ ఆర్ ` ప్ర‌మోష‌న్లో నిన్న మొన్న‌టివ‌ర‌కూ  బిజీగా ఉన్నాడు.

ఇప్పుడా చిత్రం వాయిదా ప‌డింది కాబ‌ట్టి కొత్త ప్రాజెక్ట్ ని లైన్ లోకి తెచ్చే ప్ర‌య‌త్నాలు మొద‌లుపెట్ట‌నున్నారు. అలాగే రానా `విరాటప‌ర్వం` ప‌నుల్లో బిజీగా ఉన్నాడు. ఇంకా కొత్త ప్రాజెక్ట్ ల‌కు సంబంధించి చ‌ర్చ‌లు జ‌రుపుతున్నాడు. బాహుబ‌లి విజ‌యంతో  పాన్ ఇండియా న‌టుడిగా గుర్తింపు తెచ్చుకున్న రానా ఆ త‌ర‌హాలోనే కెరీర్ ని బిల్డ్ చేసుకునే ప్ర‌య‌త్నాలు చేస్తున్నాడు. కంటెంట్ ప‌రంగాను రానా రొటీన్ కి భిన్నంగా ఉండే సినిమాలు చేస్తున్న‌ అన్న సంగ‌తి తెలిసిందే. చ‌ర‌ణ్ వ‌రుస‌గా శంక‌ర్ -సుకుమార్- గౌత‌మ్ తిన్న‌నూరిల‌తో సినిమాలు చేయ‌నున్నాడు. అయితే స్నేహితుడు రానాతో క‌లిసి చ‌ర‌ణ్ సినిమా చేసేదెపుడు? అన్న‌ది చూడాలి. ప‌వ‌న్ -రానా క‌లిసి భీమ్లా నాయ‌క్ చేస్తున్నారు. అలాంటి కాంబినేష‌న్ సెట్ అవుతుందేమో చూడాలి.
Tags:    

Similar News