ప్రభాస్ - హను.. ఓ బ్యాడ్ సెంటిమెంట్..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో ‘ఫౌజీ’ మూవీ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే.

Update: 2024-10-01 08:30 GMT

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో ‘ఫౌజీ’ మూవీ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. రీసెంట్ గా హను రాఘవపూడి ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ తమిళనాడులో స్టార్ట్ చేశారు. ప్రభాస్ లేకుండానే హీరోయిన్ పై కీలక సన్నివేశాలు షూట్ చేస్తున్నారు. ప్రభాస్ ఫౌజీ షూటింగ్ లో జాయిన్ అవ్వడానికి ఇంకా చాలా సమయం పడుతుందంట. అంత వరకు ఇతర పాత్రలకి సంబందించిన టాకీ పార్ట్ పూర్తి చేయాలని హను రాఘవపూడి అనుకుంటున్నారు.

1941-1945 మధ్య కాలంలో జరిగిన కథాంశంగా ఈ చిత్రం ఉండబోతోందని తెలుస్తోంది. ‘ఫౌజీ’ సినిమాలో ప్రభాస్ అప్పటి బ్రిటిష్ ఇండియా సోల్జర్ గా కనిపించబోతున్నాడని టాక్. లవ్ అండ్ వార్ బ్యాక్ డ్రాప్ లో ఈ కథని హను రాఘవపూడి చెప్పబోతున్నారు. ఇప్పటికే మూవీ కాన్సెప్ట్ పోస్టర్ ని రిలీజ్ చేసి అటెన్షన్ క్రియేట్ చేశారు.

హను రాఘవపూడి చివరిగా ‘సీతారామం’ మూవీ తో బ్లాక్ బస్టర్ అందుకున్నారు. అందుకే ప్రభాస్ తో చేయబోయే ‘ఫౌజీ’ మీద ఫ్యాన్స్ చాలా నమ్మకంగా ఉన్నారు. అయితే ఈ సినిమా గురించి ఇప్పుడు ఫ్యాన్స్ వేరే కారణంగా టెన్షన్ పడుతున్నారు. ఈ చిత్రంలో కీలక పాత్రలో బాలీవుడ్ స్టార్ యాక్టర్ మిథున్ చక్రవర్తి నటిస్తున్నారు. ఆయన సినిమా ప్రారంభోత్సవంలో కూడా పాల్గొన్నారు. తాజాగా మిథున్ చక్రవర్తికి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు వచ్చింది. ఈ సందర్భంగా మేకర్స్ ఆయనకి విషెస్ చెబుతూ ‘ఫౌజీ’ సినిమాలో నటిస్తోన్న విషయాన్ని కన్ఫర్మ్ చేశారు.

మిథున్ చక్రవర్తి స్టార్ యాక్టర్ గా హిందీ, బెంగాలీ భాషలలో ఎక్కువ సినిమాలు చేశారు. అయితే తెలుగులో ఆయన ‘గోపాల గోపాల’ సినిమాలో మొదటి సారిగా నటించారు. ఈ సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. తరువాత ఆది పినిశెట్టి ‘మలుపు’ చిత్రంలో ప్రతినాయకుడిగా కనిపించారు. ఈ మూవీ డిజాస్టర్ అయ్యింది. కన్నడంలో సుదీప్ ‘ది విలన్’ చిత్రంలో మిథున్ చక్రవర్తి కీలక పాత్ర చేశారు. ఈ సినిమా కూడా బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మారింది.

ఇలా సౌత్ లో మిథున్ చక్రవర్తి చేసిన సినిమాలు ఫ్లాప్ కావడంతో ఆయనపై ఒక బ్యాడ్ సెంటిమెంట్ క్రియేట్ అయ్యింది. ‘ఫౌజీ’ సినిమాకి ఆ సెంటిమెంట్ ఎక్కడ రిపీట్ అవుతుందో అని ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు. సౌత్ లో మిథున్ చక్రవర్తి చేసిన సినిమాలలో ఆయన క్యారెక్టర్స్ పవర్ ఫుల్ గా ఉన్నా కూడా ఎందుకనో ప్రేక్షకులకి కనెక్ట్ కాలేదు. అలా అని ఆ సినిమా కథలు మరీ అంత బ్యాడ్ గా ఉండవు. ఈ సినిమాలు ఫ్లాప్ కావడంతో మిథున్ చక్రవర్తి నటిస్తే ఆ మూవీ ఫ్లాప్ అవుతుందనే టాక్ పబ్లిక్ లోకి వెళ్ళిపోయింది. అయితే ‘ఫౌజీ’ మూవీతో ఆ సెంటిమెంట్ కి బ్రేక్ పడుతుందని మేకర్స్ బలంగా నమ్ముతున్నారు.

Tags:    

Similar News