మెగా హీరో సడెన్ సర్‌ప్రైజ్
మెగా హీరో వరుణ్ తేజ్ ప్రస్తుతం కరుణ కుమార్ దర్శకత్వంలో 'మట్కా' సినిమాలో నటిస్తున్న విషయం తెల్సిందే.
మెగా హీరో వరుణ్ తేజ్ ప్రస్తుతం కరుణ కుమార్ దర్శకత్వంలో 'మట్కా' సినిమాలో నటిస్తున్న విషయం తెల్సిందే. ఈ సినిమాలో వరుణ్ తేజ్ లుక్ ను ఇప్పటికే రివీల్ చేసి అందరి దృష్టిని ఆకర్షించారు. దర్శకుడు కరుణ కుమార్ విభిన్న చిత్రాల దర్శకుడిగా పేరు సొంతం చేసుకున్న నేపథ్యంలో ఈ సినిమా పై మెగా ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకుల్లోనూ అంచనాలు పెరిగాయి. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా వరుణ్ తేజ్ నటిస్తున్న ఈ సినిమా ఉంటుంది అనే విశ్వాసం వ్యక్తం అవుతోంది. సోషల్ మీడియాలో మట్కా సినిమా రిలీజ్ ఎప్పుడు అంటూ గత కొన్ని రోజులుగా ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు.
ఎట్టకేలకు మట్కా టీం అధికారికంగా సినిమా విడుదల తేదీని ప్రకటించడం జరిగింది. వచ్చే నెలలోనే ఈ సినిమా విడుదల ఉంటుందని సమాచారం అందుతోంది. మొన్నటి వరకు డిసెంబర్ లో ఈ సినిమాను విడుదల చేయాలని మేకర్స్ భావించారు. కానీ ఇప్పటికే డిసెంబర్ లో పుష్ప 2 సినిమా విడుదల కాబోతోందని అధికారిక ప్రకటన వచ్చింది. ఇప్పుడు రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ సినిమా సైతం డిసెంబర్ లోనే విడుదల కాబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఒకటి రెండు రోజుల్లోనే సినిమాకు సంబంధించిన విడుదల తేదీ గురించి అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలు ఉన్నాయని అంతా భావిస్తున్నారు.
వరుణ్ తేజ్ డిసెంబర్ లో రావడం అసాధ్యం అనే ఉద్దేశ్యంతో కాస్త ముందుగానే అంటే నవంబర్ లోనే సినిమాను విడుదల చేయబోతున్నారు. నవంబర్ 14వ తారీకున సినిమా ను ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు. అందుకు సంబంధించిన పోస్టర్ ను సైతం విడుదల చేయడం జరిగింది. పోస్టర్ లో వరుణ్ తేజ్ ను వింటేజ్ లుక్ లో చూసి ఫ్యాన్స్ హ్యాపీ ఫీల్ అవుతున్నారు. ఈ మధ్య కాలంలో వరుణ్ తేజ్ నటించిన వరుస సినిమాలు బాక్సాఫీస్ వద్ద నిరాశ పరుస్తూ వచ్చాయి. దాంతో ఈ సినిమా పై అంచనాలు భారీగా ఉన్నాయి. మరి అంచనాలను ఈ సినిమా అందుకుంటుందో చూడాలి.
డిసెంబర్ నెలలో రాబోతున్న పుష్ప 2 తో మెగా ఫ్యాన్స్ కి కచ్చితంగా వినోదాల విందు ఖాయం. పుష్ప సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో సీక్వెల్ గా రూపొందిన పుష్ప 2 కి ఆధరణ ఓ రేంజ్ లో ఉండే అవకాశం ఉంది. మరో వైపు రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న గేమ్ ఛేంజర్ సినిమా ను డిసెంబర్ మూడో లేదా చివరి వారంలో ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు. అన్ని వర్గాల వారిని ఆకట్టుకునే విధంగా ఈ సినిమా ఉంటుంది అంటున్నారు. కనుక ఈ రెండు సినిమాలకు పోటీ వద్దు అనుకుని, జనవరి లో విడుదలకు అవకాశం లేక పోవడంతో మట్కా ను నవంబర్ లోనే విడుదల చేయాలని అనుకోవడం మంచి నిర్ణయం అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.