ఆ న‌టులంతా శోభిత పిల్ల‌ల దృష్టిలో అవెంజ‌ర్స్!

తెలుగు అమ్మాయి శోభిత ధూళిపాళ‌-అక్కినేని వార‌సుడు నాగ‌చైత‌న్య త్వ‌ర‌లో వివాహ బంధంతో ఒక‌టి కానున్న సంగ‌తి తెలిసిందే.

Update: 2024-10-01 05:55 GMT

తెలుగు అమ్మాయి శోభిత ధూళిపాళ‌-అక్కినేని వార‌సుడు నాగ‌చైత‌న్య త్వ‌ర‌లో వివాహ బంధంతో ఒక‌టి కానున్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే ఎంగేజ్ మెంట్ తంతు కూడా పూర్తి చేసారు. పెద్ద‌లు పెళ్లికి మంచి మూహూర్తం తేదీనికి వెతికే ప‌నిలో అన్నారు. ఆ తేదీ త్వ‌ర‌లోనే బ‌య‌ట‌కు రానుంది. అయితే తాజాగా శోభిత త‌న పిల్ల‌ల‌కు `పొన్నియ‌న్ సెల్వ‌న్` లోని న‌టుల గురించి వాళ్లంతా ఎవెంజ‌ర్స్ అని చెబుతానంటోంది.

మ‌ణిర‌త్నం ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన `పొన్నియ‌న్ సెల్వ‌న్-1 `లో శోభిత కూడా న‌టించిన సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా విడుద‌లై రెండేళ్లు పూర్త‌వుతుంది. ఈ సంద‌ర్బంగా ఆనాటి రోజుల్ని శోభిత గుర్తు చేసుకుంది. టీమ్ తో క‌లిసి దిగిన కొన్ని ఫోటోల‌ను షేర్ చేసింది. విక్ర‌మ్, కార్తి, జ‌యం ర‌వి, త్రిష‌, ఐశ్వ‌ర్యారాయ్ ఇలా వీళ్లంద‌రితో క‌లిసి ఆ సినిమాలో న‌టించాను. త‌ర్వాత ఎప్పుడైనా వీళ్ల గురించి నా పిల్ల‌లు అడిగితే అవెంజ‌ర్స్ అని చెబుతానంది.

పొన్నియ‌న్ సెల్వ‌న్ క‌ల్కి కృష్ణ‌మూర్తి రచించిన న‌వ‌ల ఆధారంగా తెర‌కెక్కించిన సంగ‌తి తెలిసిందే. మొద‌టి భాగం మంచి విజ‌యం సాధించ‌డంతో దానికి కొన‌సాగింపుగా రెండవ భాగం చేసి మ‌రో హిట్ అందుకున్నారు. ఎన్నో అవార్డులు..రివార్డులు సైతం ద‌క్కించుకుంది ఈ చిత్రం. ఇటీవ‌ల జ‌రిగిన ఐఫా వేడుకల్లోనూ పుర‌స్కార‌లు వ‌రించాయి. ఉత్త న‌టుడిగా విక్ర‌మ్ అవార్డు అందుకోగా, క్రిటిక్స్ ఛాయిస్ లో ఉత్తమ న‌టి ఐశ్వర్యారాయ్ నిలిచిన సంగ‌తి తెలిసిందే.

ఈ సినిమాల అనంత‌రం శోభిత న‌టించిన హాలీవుడ్ చిత్రం `మంకీ మ్యాన్` రిలీజ్ అయింది. అటుపై `ల‌వ్ సితార` కూడా ఇటీవల‌ రిలీజ్ అయింది. వీటి త‌ర్వాత ఇంకా కొత్త సినిమాలు వేటికి శోభిత సైన్ చేయ‌లేదు. చైత‌న్య‌తో నిశ్చితార్దం అయిన నేప‌థ్యంలో కొన్ని రోజులు గ్యాప్ తీసుకున్న‌ట్లు క‌నిపిస్తుంది.

Tags:    

Similar News