ఆచార్య మేక‌ర్స్ చెర్రీకి అదిరే గిఫ్ట్

Update: 2022-03-27 05:30 GMT
టాలీవుడ్ స్టార్ హీరో.. మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ RRRలో తన అద్భుతమైన నటనతో మరోసారి అద్భుతమైన నటుడని నిరూపించారు. అల్లూరి సీతారామ‌రాజుగా అత‌డి న‌ట‌న మ‌రో లెవ‌ల్లో ఉంద‌ని ప్ర‌శంస‌లు ద‌క్కాయి. మరోవైపు చ‌ర‌ణ్ న‌టించిన ఆచార్య విడుద‌ల‌కు సిద్ధ‌మవుతున్న సంగ‌త తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి ప్ర‌ధాన‌పాత్ర పోషించిన ఆచార్యలో చ‌ర‌ణ్ కీలక పాత్రలో కనిపించనున్నాడు.

ఈ రోజుతో చ‌ర‌ణ్‌ మరో సంవత్సరం పెద్దవాడయ్యాడు. ఈ సంద‌ర్భంగా అభిమానులు సెల‌బ్రేష‌న్స్ లో మునిగి తేలారు. ఆచార్య నిర్మాతలు అతని పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేక పోస్టర్ ను విడుదల చేశారు. పోస్టర్ లో వేణువు పట్టుకుని నవ్వుతున్న రామ్ చరణ్ ని ప్రదర్శించారు. పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. భారీ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రంలో రామ్ చరణ్ కు జోడీగా పూజా హెగ్డే కనిపించనుంది. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో చిరు స‌ర‌స‌న‌ కాజల్ అగర్వాల్  కథానాయికగా నటించింది.

మ్యాట్నీ ఎంటర్ టైన్ మెంట్ తో కలిసి కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ నిర్మించిన ఈ చిత్రం 2022 ఏప్రిల్ 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. మణిశర్మ ఈ చిత్రానికి సంగీతం అందించారు. ఇప్ప‌టికే పాట‌ల‌కు చ‌క్క‌ని రెస్పాన్స్ వ‌చ్చింది. ఇక‌పై ప్ర‌చార కార్య‌క్ర‌మాల్ని ముమ్మ‌రం చేయ‌నున్నారని తెలుస్తోంది.

తాజాగా రిలీజ్ చేసిన పోస్ట‌ర్లో చ‌ర‌ణ్ ఎంతో ప్లెజెంట్ గా క‌నిపిస్తున్నాడు. పిల్ల‌న‌గ్రోవిని చేత‌బ‌ట్టి నుదిటిన కుంకుమ‌బొట్టుతో సాత్వికుడిలా క‌నిపిస్తున్నాడు. కానీ ఆ త‌ర్వాత అత‌డు గ‌న్ చేత‌బ‌ట్టాల్సిన అవ‌స‌ర‌మేంటో తెలియాంటే ఆచార్య సినిమా చూడాల్సిందే.
Tags:    

Similar News