ఇటీవల రష్యా - ఉక్రెయిన్ దేశాల మధ్య మొదలైన యుద్ధం ఇప్పటికీ కొనసాగుతోంది. ఈ భీకర యుద్ధంలో ఎంతోమంది అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు. అయితే ఈ యుద్ధంలో హీరో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పేరు తెర మీదకు వచ్చింది. నిజానికి ఉక్రెయిన్-రష్యా యుద్ధానికి చెర్రీకి సంబంధం లేదు.. కానీ రష్యా సైనికుల నుంచి తమ మాతృభూమిని కాపాడుకుంటున్న ఒక ఉక్రెయిన్ పౌరుడి కి, చరణ్ కు సంబంధం ఉంది.
రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ - జూనియర్ ఎన్టీఆర్ కలిసి నటించిన "ఆర్.ఆర్.ఆర్" మూవీ షూటింగ్ కొంతకాలం ఉక్రెయిన్ లో కూడా జరిగింది. షూటింగ్ జరిగే సమయంలో రస్తీ అనే వ్యక్తి చరణ్ కు సెక్యూరిటీ గార్డ్ గా పనిచేశారు. దీంతో చరణ్ తో రస్తీకి సాన్నిహిత్యం ఏర్పడింది. అయితే యుద్ధం నేపథ్యంలో రస్టీ కుటుంబం కష్టాలు పడుతోంది.
ఉక్రెయిన్ అధ్యక్ష్యుడి పిలుపు మేరకు రస్తీ మరియు అతని 80 ఏళ్ళ తండ్రి మిలిటరీలో చేరి తమ దేశాన్ని రక్షించుకునే ప్రయత్నం చేస్తున్నారు. యుద్ధం కారణంగా రస్తీ ఆ దేశ పౌరులలానే ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. యుద్ధం అనగానే తనకు ఉక్రెయిన్ లో రక్షణ అందించిన రస్తీనే చరణ్ కు గుర్తు వచ్చారు. ఈ క్రమంలో కష్టాల్లో ఉన్న తన మాజీ బాడీగార్డ్ కుటుంబాన్ని ఆదుకొని పెద్ద మనస్సు చాటుకున్నారు.
రస్తీని ఫోన్ లో పరామర్శించిన రాంచరణ్.. అక్కడ వారు పడుతున్న ఇబ్బందులు తెలుసుకున్నారు. వెంటనే రస్తీ కుటుంబానికి తన వంతు ఆర్థిక సాయం అందించారు. నిత్యావసర వస్తువులను, ముందులు మరియు ఇతర సామాగ్రిని పంపించారు. ఈ విషయాన్ని రస్టీ ఓ వీడియో ద్వారా వెల్లడిస్తూ.. చెర్రీ తనకు చేసిన సాయం పట్ల ఆనందం వ్యక్తం చేశాడు.
కొంత కాలమే రామ్ చరణ్ తో కలిసి పనిచేసినా.. కష్టాల్లో ఉన్న తన కుటుంబాన్ని ఆదుకోవడం ఆయన గొప్ప మనసుకి నిదర్శనమని రస్తీ కృతజ్ఞతలు తెలిపారు. చరణ్ సార్ పంపించిన మందులతో అనారోగ్యంతో ఉన్న తన భార్య కోలుకుందని.. ఆయనకు ఎప్పటికీ రుణపడి ఉంటానని తెలిపారు రస్టీ. రష్యాతో యుద్ధం వల్ల తన దేశం, కుటుంబం పడుతున్న ఇబ్బందులను కూడా ఈ వీడియోలో వెల్లడించారు.
రామ్ చరణ్ గురించి రస్టీ మాట్లాడిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చెర్రీ పెద్ద మనసుపై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. ఇక ఉక్రెయిన్ లో RRR షూటింగ్ సమయంలో చరణ్ పక్కన రస్తీ నిలబడి ఉన్న ఓ ఫోటో నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఇది 'నాటు నాటు' పాట చిత్రీకరణ సమయంలో తీసిన పిక్ అని తెలుస్తోంది.
Full View