రామ్ చరణ్.. అతి కష్టమైన సీన్!

Update: 2022-11-14 02:30 GMT
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ RRR సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మంచి గుర్తింపును అందుకున్న విషయం తెలిసిందే. దర్శకధీరుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరపైకి తీసుకువచ్చిన ఆ సినిమా ద్వారా జూనియర్ ఎన్టీఆర్ తో పాటు రామ్ చరణ్ కూడా మంచి గుర్తింపు అందుకున్నారు. ఇక వారి భవిష్యత్తుకు కూడా ఆ సినిమా మంచి పాన్ ఇండియా బాటలు వేసింది అని చెప్పవచ్చు.

అందుకే ఇప్పుడు నేషనల్ మీడియాలో కూడా ఇద్దరూ వైరక్ గా మారుతున్నారు. ఇక రామ్ చరణ్ తేజ్ ఇటీవల ప్రముఖ హిందుస్థాన్ మీడియా ఛానల్ నిర్వహించిన స్పెషల్ సమ్మెట్ ఈవెంట్లో రామ్ చరణ్ ప్రత్యేక అతిథిగా పాల్గొన్నారు. అంతేకాకుండా ఈ వేడుకకు బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ కూడా వచ్చాడు. వీరి మధ్యలో కొనసాగిన సంభాషణ అందరిని ఎంతగానో ఆకట్టుకుంది.

అంతే కాకుండా ప్రత్యేకంగా స్టెప్పులు కూడా వేశారు. ఇక వారి జీవితంలోని కఠినమైన సమయాలను అలాగే మంచి మధురమైన జ్ఞాపకాలను కూడా షేర్ చేసుకునే ప్రయత్నం చేశారు. ఇక రామ్ చరణ్ తేజ్ జీవితంలో పడిన అత్యంత కష్టమైన సన్నివేశం గురించి కూడా వివరణ ఇచ్చాడు. ఇటీవల వచ్చిన RRR సినిమాలో ఒక సన్నివేశం కోసం చాలా డిఫికల్ట్ గా అనిపించింది అని చెప్పాడు.

తన ఇంట్రడక్షన్ సన్నివేశం కోసం దాదాపు 30 రోజులు కష్టపడ్డామని అయితే చిన్నప్పటినుంచి కూడా డస్ట్ ఎలర్జీ ఉండడంతో సినిమా షూటింగ్ లలో పెద్దగా ఇలాంటి సన్నివేశాలలో ఎప్పుడు నటించలేదని చెప్పుకొచ్చాడు. అయితే RRR లో మాత్రం తొలి సన్నివేశం కోసం దుమ్ములో అలాగే వందలాది మంది జనాల మధ్యలో చాలా కష్టంగా ఆ షూటింగ్ పూర్తి చేయాల్సి వచ్చింది అని చెప్పాడు. అయితే ఆ సన్నివేశం అంత బాగా రావడానికి పూర్తి క్రెడిట్ కూడా రాజమౌళికే చెందుతుంది అని ఆయన విజన్ కారణంగానే ఆ సన్నివేశం విజయవంతంగా పూర్తి చేసినట్లుగా రామ్ చరణ్ చెప్పుకొచ్చాడు.
Tags:    

Similar News