జ‌పాన్ లోనూ ఆ స్టార్ హీరో సినిమా!

ప‌క్కా క‌మ‌ర్శియ‌ల్ ఎంట‌ర్ టైన‌ర్ గా 300 కోట్ల బ‌డ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించారు. కానీ రిలీజ్ అనంత‌రం మూడు రెట్ల వ‌సూళ్ల‌ను సాధించింది.

Update: 2024-10-03 15:30 GMT

బాలీవుడ్ బాదా షా షారుక్ ఖాన్ -అట్లీ కాంబినేష‌న్ లో రిలీజ్ అయిన `జ‌వాన్` చిత్రం పాన్ ఇండియాలో ఎలాంటి సంచ‌లనాలు న‌మోదు చేసిందో తెలిసిందే. 1000 కోట్ల‌కు పైగా వ‌సూళ్ల‌ను సాధించి షారుక్ కెరీర్ లో మ‌రో బ్లాక్ బ‌స్ట‌ర్ గా నిలిచింది. ప‌క్కా క‌మ‌ర్శియ‌ల్ ఎంట‌ర్ టైన‌ర్ గా 300 కోట్ల బ‌డ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించారు. కానీ రిలీజ్ అనంత‌రం మూడు రెట్ల వ‌సూళ్ల‌ను సాధించింది.

దీంతో షారుక్ ఖాతాలో మ‌రో మైల్ స్టోన్ చిత్రంగా నిలిచింది. రోటీన్ స్టోరీతో అట్లీ మ‌రోసారి షారుక్ బ్రాండ్ ఇమేజ్ తో ఇది సాధించ‌డం విశేషం. తాజాగా ఈ చిత్రాన్ని జ‌పాన్ లోనూ రిలీజ్ చేస్తున్నారు. ఈ సంద‌ర్భాన్ని షారుక్ ఓ వీడియో రూపంలో తెలియ‌జేసారు. `న్యాయం కోసం పోరాడిన ఓ యువ‌కుడి క‌థ జవాన్.

మ‌రి అత‌డి యాక్ష‌న్ చూడ‌టానికి సిద్దంగా ఉన్నారా? న‌వంబ‌ర్ 29న జ‌పాన్ ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నాడు` అని తెలిపారు. ప్ర‌స్తుతం ఈ వీడియో నెట్టింట వైర‌ల్ గా మారింది. షారుక్ ఖాన్ కి జ‌పాన్ లోనూ మంచి క్రేజ్ ఉంది. అత‌డి చాలా సినిమాలు జ‌పాన్ లో రిలీజ్ అయ్యాయి. ఆ మ‌ధ్య ప‌ఠాన్ చిత్రాన్ని అక్క‌డ రిలీజ్ చేసి మంచి విజ‌యం సాధించారు. ఈనేప‌త్యంలో మ‌రోసారి బాద్ షా మ‌రోసారి జ‌పాన్ వెళ్తున్నారు.

షారుక్ ఖాన్ యాక్ష‌న్ అడ్వెంచ‌ర్ చిత్రాల‌కు మంచి డిమాండ్ ఉంటుంది. అత‌డి లో కామెడీ టింజ్ అక్క‌డ ఆడియ‌న్స్ బాగా క‌నెక్ట్ అవుతారు. ఈ నేప‌థ్యంలో మ‌రోసారి యాక్ష‌న్ చిత్రాన్ని జ‌నాన్ ఇండియ‌న్స్ చూపిస్తున్నాడు. ఇంకా జ‌పాన్ లో ర‌జ‌నీకాంత్, ప్ర‌భాస్, లాంటి స్టార్ హీరోల‌కు మంచి క్రేజ్ ఉన్న సంగ‌తి తెలిసిందే. ఇటీవ‌లే ఓ జ‌పాన్ అభిమాని యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ త‌మ దేశం రావాల‌ని ఆమెరికాలో ఆహ్వానించింది. అందుకు తార‌క్ కూడా త‌ప్ప‌కుండా వ‌స్తాన‌ని మాటిచ్చారు.

Tags:    

Similar News