రాజమౌళి అలా ఉండటమే కరెక్ట్: చరణ్

Update: 2022-03-18 16:09 GMT
ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎన్టీఆర్ అభిమానులు .. మెగా ఫ్యాన్స్ అంతా కూడా 'ఆర్ ఆర్ ఆర్' కోసం వేయికళ్లతో వెయిట్ చేస్తున్నారు. వాళ్లందరిలో ఉత్సాహన్ని రెట్టింపు చేస్తూ ఈ సినిమా ఈ నెల 25వ తేదీన థియేటర్లకు రానుంది. దాంతో ఈ  సినిమా ప్రమోషన్స్ వేగాన్ని పెంచారు. ప్రమోషన్స్ విషయంలో ఎంతమాత్రం తగ్గకుండా పక్కా ప్లానింగ్ తో ముందుకు వెళుతున్నారు. పూర్తి క్లారిటీతో ఆయా ప్రాంతాల్లో ప్రమోషన్స్ ను నిర్వహిస్తున్నారు. అలా ఈ సినిమా టీమ్ 'దుబాయ్' వెళ్లింది. దుబాయ్ ప్రెస్ మీట్ లో చరణ్ కి రాజమౌళిని గురించిన ప్రశ్న ఎదురైంది.

రాజమౌళి ఓ మాన్ స్టర్ అన్నట్టుగా ఎన్టీఆర్ చెబుతున్నారు గదా? ఆయనతో మీరు ఇంతకుముందు 'మగధీర' చేశారు. మళ్లీ ఇప్పుడు 'ఆర్ ఆర్ ఆర్' చేశారు. అప్పటికీ .. ఇప్పటికీ రాజమౌళిలో ఏమైనా మార్పు వచ్చిందా? అనే ప్రశ్న ఎదురైంది. అందుకు చరణ్ స్పందిస్తూ .. 'మగధీర'తో పోలిస్తే ఆ లక్షణాలు ఇప్పుడు కాస్త తగ్గాయనే చెప్పాలి. ఆయన వైపు నుంచి ఆ మాత్రం ప్రెజర్ ఉండాలనే నేను కోరుకుంటాను. అలాంటి ప్రెజర్ ఉన్నప్పుడే నేను ఇంకా బాగా చేయగలను. నేనే కాదు ఏ ఆర్టిస్ట్ కైనా అలాగే అనిపిస్తుంది.

ఈ సన్నివేశం కోసం ఆయన ఇంతగా తపన పడుతున్నారు .. నా పాత్ర వైపు నుంచి పెర్ఫెక్షన్ కోసం ఆయన అంతగా తాపత్రయ పడుతున్నారు అని అనుకుంటే అప్పుడు అది ప్రెజర్ గా అనిపించదు. మనవంతు ప్రయత్నం మనం చేద్దాం అనే ఒక ఆలోచన వస్తుంది. అప్పుడు ఆయనలా కష్టపడటం వలన అనుకున్న అవుట్ ఫుట్ వస్తుంది. అందువలన రాజమౌళి .. రాజమౌళిగానే ఉండాలని నేను కోరుకుంటాను. ఆయన నుంచి ఆర్టిస్టులపై ఆ మాత్రం ప్రెజర్ ఉండాలనే నేను భావిస్తాను. ఇక ప్రస్తుతం నేను చేస్తున్న శంకర్ .. సుకుమార్ కూడా ఇదే కేటగిరిలోకి వస్తారు' అంటూ నవ్వేశాడు.
Tags:    

Similar News