క్యూట్ లుక్ లో కాక పుట్టించేలా!

అలా చేయ‌గ‌ల్గింది కాబ‌ట్టి నేడు స‌ల్మాన్ ఖాన్ తో ఛాన్స్ అందుకుంది.

Update: 2024-10-02 03:43 GMT

నేష‌న‌ల్ క్రష్ ర‌ష్మిక మందన్నా హాట్ అప్పిరియ‌న్స్ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. అమ్మ‌డు బాలీవుడ్ కి వెళ్లిన నాటి నుంచి త‌న లో కొత్త యాంగిల్ ని బ‌య‌ట‌కు తీసింది. అక్కడ క‌ల్చ‌ర్ కి త‌గ్గ‌ట్టు మూవ్ అవుతుంది. నార్త్ భామ‌ల నుంచి పోటీని త‌ట్టుకుని మార్కెట్ లో నిల‌బ‌డాలంటే ఆమాత్రం త‌ప్ప‌నిస‌రి. అలా చేయ‌గ‌ల్గింది కాబ‌ట్టి నేడు స‌ల్మాన్ ఖాన్ తో ఛాన్స్ అందుకుంది. స్టార్స్ చిత్రాల్లో భాగ‌మ‌వుతుంది.


అప్ప‌టి నుంచి సోష‌ల్ మీడియా యాక్టివిటీని మ‌రింత స్పీడ‌ప్ చేసింది. ఎప్ప‌టిక‌ప్పుడు కొత్త ఫోటోల‌తో ట్రెండ్ కి తెర తీస్తుంది. తాజాగా అమ్మ‌డు క్యూట్ లుక్ ఫోటోలు కొన్ని షేర్ చేసింది. జ‌ర్నీ చేస్తూ క్యాబిన్ నుంచి ఫోటోలు పంచుకుంది. ఇందులో అమ్మ‌డు త‌న మార్క్ చేష్ట‌ల‌తో అల‌రించింది. రెండు చేతుల వేళ్ల‌ను క‌లిపి ల‌వ్ సింబ‌ల్ చేసింది. ముఖం నుంచి ర‌క‌ర‌కాల హావ‌భావాలు ఒలికించింది.


పెదాల‌కు లిప్ స్టిక్ త‌ప్ప పెద్ద‌గా మ్యాక‌ప్ వేసుకోలేదు. నేచుర‌ల్ బ్యూటీతోనే క‌నిపిస్తుంది. అమ్మ‌డు పాల నురుగుల సౌంద‌ర్యంతో త‌ళ‌త‌ళ‌లాడిపోతుంది. ఫోటోల‌న్ని క్యూట్ గా ఉన్నాయి. ప్ర‌స్తుతం ఈ పిక్స్ అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారాయి. దీంతో కామెంట్ బాక్స్ లో పోస్టులు అంతే ఇంట్రెస్టింగ్. ఎవ‌రి స్టైల్లో వారు ప్ర‌పోజ్ చేస్తున్నారు.


ఇక ర‌ష్మిక డిసెంబ‌ర్ లో `పుష్ప‌-2` తో ర‌చ్చ చేయ‌డానికి రెడీ అవుతుంది. రిలీజ్ కి కోసం తాను కూడా ఎంతో ఎగ్జైట్ మెంట్ తో ఎదురు చూస్తుంది. ఈ సినిమా ప్రచారం ప్రారంభ‌మైత‌న త‌ర్వాత ర‌ష్మిక ఎలాంటి టెక్నిక్ ల‌తో ఎంగేజ్ చేస్తుంద‌ని ఓ సెక్ష‌న్ ఆడియ‌న్స్ ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు.

Tags:    

Similar News