వాళ్లిద్దరూ సీక్రెట్ గా పెళ్లి చేసుకున్నారా?
'హ్యాపీ యానివర్సిరీ పార్టనర్' అంటూ ఓ పోస్ట్ పెట్టాడు.
హృతిక్ రోషన్-సబా అజాద్ కొంత కాలంగా డేటింగ్ లో ఉన్న సంగతి తెలిసిందే. సెస్సానే ఖాన్ తో విడిపోయిన తర్వాత హృతిక్ , సబాకి దగ్గరయ్యాడు. ఇదంతా అందిరికీ తెలిసిన తంతే. ఇరువురు పెళ్లి చేసుకుంటారనే ప్రచారం కూడా పెద్ద ఎత్తున జరిగింది. అయితే తాజాగా హృతిక్ ఓ పోస్ట్ పెట్టడం సంచల నంగా మారింది. 'హ్యాపీ యానివర్సిరీ పార్టనర్' అంటూ ఓ పోస్ట్ పెట్టాడు.
అలాగే ఇద్దరు వెకేషన్ లో ఉన్న ఓ ఫోటో కూడా పోస్ట్ చేసాడు. దీంతో పార్టనర్ అంటూ హృతిక్ సంబో ధించడం..యానివర్సిరీ చెప్పడంతో సందేహాలు మొదలయ్యాయి. ఇద్దరు సీక్రెట్ గా పెళ్లి చేసు కున్నారా? అందుకే హృతిక్ అలా అన్నాడా? పెళ్లి చేసుకుని ఏడాది పూర్తయిందా? అందుకేనా ఆ విషెస్ అంటూ ఆరాలు మొదలయ్యాయి. అదే నిజమైతే గత అక్టోబర్ లోనే వీళ్లి పెళ్లి జరిగి ఉండాలి.
ఇప్పుడిదే నెట్టింట నెటి జనుల్లో చర్చకు దారి తీసింది. గతంలో సబా ఆజాద్ త్వరలోనే గుడ్ న్యూస్ చెబు తానని ఓ పోస్ట్ పెట్టింది. ఆపోస్ట్ సంకేతం కూడా ఇదేనా? అన్న అనుమానాలు బలపడుతున్నాయి. మరి ఈ గుట్టు వీడాలంటే పెళ్లి జరిగిందా? లేక మరో సందర్భాన్ని ఉద్దేశించి హృతిక్ అలా స్పందించాడా? అన్నది తెలియాలి.
ఇక సుస్నాన్ ఖాన్ అర్స్ లాన్ గోనీతో ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. వీరిద్దరు కూడా పెళ్లి చేసుకుంటున్నారనే ప్రచారం ఉంది. ప్రస్తుతం హృతిక్ రోషన్ హీరోగా `వార్ 2` తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఇందులో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా నటిస్తున్నాడు. ఈ స్టార్ హీరోల మధ్య డాన్సు పరంగానూ పోటీ పడేలా ఓ సాంగ్ డిజైన్ చేస్తున్నారు. ఇద్దరు ఎలాంటి డాన్సర్లు అన్నది చెప్పాల్సిన పనిలేదు.