బ్లాక్ అండ్ బ్లాక్ లో చ‌ర‌ణ్ సూప‌ర్బ్ లుక్

Update: 2022-01-05 15:30 GMT
మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ మేకోవ‌ర్ అన్నివేళ‌లా హాట్ టాపిక్. టాలీవుడ్ మాచో మ్యాన్ గా అత‌డి ప‌రివ‌ర్తన యువ‌త‌రానికి స్ఫూర్తి. చ‌ర‌ణ్  స్టైలింగ్ సెన్స్.. యూనిక్ టేస్ట్ అల్టిమేట్ అని పొగిడేయ‌కుండా ఉండ‌లేం. మిగ‌తా హీరోల‌తో పోలిస్తే చ‌ర‌ణ్ స్టైలింగ్ విష‌యంలో ఏమాత్రం త‌గ్గ‌డు. ఆ ర‌కంగా త‌న‌కంటూ ఓ బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు.  తాజాగా చ‌ర‌ణ్ కొత్త ఫోటోషూట్ ఒక‌టి ఇన్ స్టాలో వైర‌ల్ గా మారింది. ఔట్ అండ్ ఔట్ బ్లాక్ డాప‌ర్ ఎపీరియ‌ల్ లు క్ లో సూప‌ర్బ్ గా ఉన్నాడు. షైనీ వాల్వెట్ బ్లాక్ జాకెట్..ఎంబాలిష్ షూస్ ధ‌రించి..  చ‌ర‌ణ్ మార్క్ ఎలివేష‌న్ ఆక‌ట్టుకుంటోంది. ఆ హెయిర్ స్టైల్.. ట్రిమ్డ్ బీయ‌ర్డ్ తో సూప‌ర్బ్ లుక్ లో క‌నిపిస్తున్నాడు. ప్ర‌స్తుతం ఈ ఫోటో సోష‌ల్  మీడియాలో  వైర‌ల్ గా మారింది.

చ‌ర‌ణ్ ని  అభిమానులు ఈ లుక్ లో చూసుకుని మురిసిపోతున్నారు. ఇక బ్లాక్ అండ్ బ్లాక్ లుక్ ఫాద‌ర్ చిరంజీవికి పూర్తి కాంట్రాస్ట్ అని చెప్పొచ్చు. చిరంజీవికి వైట్ క‌ల‌ర్  అంటే ఎంతో ఇష్టం. ఆ రంగు దుస్తుల్ల‌నే ధ‌రించ‌డానికి ఇష్ట‌ప‌డతారు. మ‌రి చిరుకి ఇష్ట‌మైన‌ది.. చ‌ర‌ణ్ ఫేవ‌రెట్ క‌లర్ బ్లాక్ అన్న‌ది తెలిసిందే ఇక చ‌ర‌ణ్ సినిమాల విష‌యానికి వ‌స్తే ఆయ‌న క‌థానాయ‌కుడిగా న‌టించిన పాన్  ఇండియా చిత్రం `ఆర్.ఆర్.ఆర్` రిలీజ్ వాయిదా ప‌డిన సంగ‌తి తెలిసిందే. దీంతో చ‌ర‌ణ్ త‌దుప‌రి ప్రాజెక్ట్ ని లైన్ లోకి తెచ్చే ప్ర‌య‌త్నాలు మొద‌లు పెట్టారు.  ఇప్ప‌టికే శంకర్ ద‌ర్శ‌క‌త్వంలో న‌టిస్తోన్న సినిమా షూటింగ్ కొంత వ‌ర‌కూ జ‌రిగింది.

శంకర్ `ఇండియ‌న్ -2` షూట్ పూర్తి చేయాల్సిన నేప‌థ్యంలో తాత్కాలికంగా చ‌ర‌ణ్ ప్రాజెక్ట్ ని ప‌క్క‌న‌బెట్టారు. దీంతో చ‌ర‌ణ్ కొత్త ప్రాజెక్ట్ ప్రారంభించాల‌ని చూస్తున్నారు.` జెర్సీ` ద‌ర్శ‌కుడు గౌత‌మ్ తిన్న‌నూరితో ప్ర‌స్తుతానికి క‌మిట్ మెంట్ ఉంది. ఇప్ప‌టికే స్క్రిప్ట్ కూడా లాక్ అయింది.  ఆ సినిమాని సెట్స్ మీద‌కు తీసుకెళ్లాల‌ని ప్లాన్ చేస్తున్న‌ట్లు స‌మాచారం. ఈలోగానే సుకుమార్ తోనూ వేరొక సినిమా సెట్స్ కెళ్లేందుకు ఆస్కారం లేక‌పోలేద‌న్న గుస‌గుస‌లు తాజాగా వైర‌ల్ అవుతున్నాయి. అయితే అధికారికంగా వివ‌రాలు వెల్ల‌డి కావాల్సి ఉంది.
Tags:    

Similar News