రంగస్థలం సినిమాతో తన మార్కెట్ ను ఒక్కసారిగా పెంచేసుకున్నాడు రామ్ చరణ్. తన అద్భుతమైన నటనతో అందరిని మెప్పించాడు. ఇప్పుడు ఫాన్స్ అంతా చెర్రీ తరువాత సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. మాస్ టచ్ కావాలి అనుకున్నాడో ఏమో మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను తో సినిమా చేయడానికి మెగా పవర్ స్టార్ రెడి అవుతున్నాడు.
ఇప్పుడు ఈ సినిమా టైటిల్ ఎం పెడదాం అని సినిమా యూనిట్ అంతా దీర్ఘాలోచన చేస్తున్నారట. బోయపాటి మాత్రం ఒక క్లాస్ టైటిల్ ఖరారు చేద్దాం అని ప్లాన్ చేస్తున్నాడు. ఆ టైటిల్ మరేదో కాదు 'రాజ వంశస్థుడు' అంట. టైటిల్ బాగానే ఉంది అని కొందరు అన్నా మాస్ సినిమాకి క్లాస్ టైటిల్ సెట్ అవుతుందా అని కొందరు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. కానీ బోయపాటి మాత్రం మనసు మార్చుకునేలా కనిపించట్లేదు.
అయిన రామ్ చరణ్ సినిమా టైటిల్ అంటే మెగా స్టార్ చిరంజీవికి నచ్చి తీరాల్సిందే. కాబట్టి ఇప్పుడు సై రా సినిమాతో బిజీగా ఉన్న చిరు రాజా వంశస్థుడు టైటిల్ కు సై అంటే అదే పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయినా ముందుగా ఒక టైటిల్ అనుకోవడం జనాల లోకి లీక్ చేయడం, మంచి టాక్ వస్తే అదే టైటిల్ గా ఉంచేయడం ఈ మధ్య డైరెక్టర్లు చేస్తున్న పనేగా. చూద్దాం మరి చిట్టిబాబు ఈ సారి రాజ వంశస్థుడు గా వస్తాడో లేక మరో పేరుతో అలరిస్తాడో.