RC 15: మరో పని కోసం బయలుదేరిన రామ్ చరణ్

Update: 2022-11-20 10:30 GMT
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ RRR సినిమాతో బాక్సాఫీస్ వద్ద భారీ స్థాయిలో విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఇక ఆ సినిమా తర్వాత మళ్ళీ అదే తరహాలో సక్సెస్ అందుకోవాలి అని ఇప్పుడు తన 15వ సినిమాతో బిజీగా ఉన్నాడు. సంచలన దర్శకుడు శంకర్ దర్శకత్వంలో తెరపైకి రాబోతున్న ఆ ప్రాజెక్టుపై అంచనాలు అయితే మామూలుగా లేవు.

తప్పకుండా ప్రాజెక్ట్ బాక్సాఫీస్ వద్ద సరికొత్త సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది అని మెగా అభిమానులు కూడా ఎంతో నమ్మకంతో ఉన్నారు. ఇక ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకోవాల్సిన ఈ సినిమా వివిధ కారణాల వలన వాయిదా పడుతూ వస్తున్న విషయం తెలిసిందే. ఇక మొత్తానికి దర్శకుడు శంకర్ మరొక కీలకమైన షెడ్యూల్ మొదలు పెట్టడానికి రెడీ అయ్యాడు.

మరి కొన్ని రోజుల్లో న్యూజిలాండ్ లో ఒక కీలకమైన షెడ్యూల్ స్టార్ట్ కాబోతోంది. ఇక రీసెంట్ గా తన భార్యతో కలిసి ఆఫ్రికా అడవులలో వెకేషన్ లో ఎంజాయ్ చేసిన రామ్ చరణ్ ఇప్పుడు 15వ సినిమా న్యూజిలాండ్ షెడ్యూల్ కోసం సిద్ధమయ్యాడు. గత రాత్రి రామ్ చరణ్ హైదరాబాదులోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో కనిపించాడు.

అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఇక ఆ షెడ్యూల్లో ఈ సినిమాకు సంబంధించిన మరొక కీలకమైన పాటను కూడా చిత్రీకరంచనున్నారు. ఆ పాట కోసం నిర్మాత దిల్ రాజు భారీ స్థాయిలో ఖర్చు చేయనున్నట్లు సమాచారం.

RC 15 సినిమా పొలిటికల్ డ్రామాగా తెరకెక్కుతుండగా చరణ్ ఇందులో రెండు విభిన్నమైన పాత్రల్లో కనిపించబోతున్నాడు.  డైరెక్టర్ ఎస్‌జే సూర్య ప్రధాన విలన్ పాత్రలో నటిస్తుండగా.. కీయరా అద్వానీ మేయిన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇక శ్రీకాంత్, అంజలి, నవీన్ చంద్ర తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.  శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు నిర్మిస్తున్న ఈ మెగా మూవీకి థమన్ సంగీతం అందించనున్నారు.
Tags:    

Similar News