పాన్ ఇండియా వెబ్ సిరీస్ కు రామరాజు రెడీ!?

Update: 2022-03-31 17:30 GMT
ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాలో అల్లూరి సీతరామరాజు పాత్రలో నటించి దేశ వ్యాప్తంగా మంచి ఆధరణ దక్కించుకున్న రామ్‌ చరణ్ తన తదుపరి ప్రాజెక్ట్‌ ల విషయంలో అత్యంత జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఆయన ప్రతి సినిమా కూడా ఇక నుండి ఆహా అన్నట్లుగా ఉండేలా స్క్రిప్ట్‌ ను ఎంపిక చేసుకుంటున్నాడనే వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే శంకర్ దర్శకత్వంలో ఒక సినిమా ను చరణ్ చేస్తున్న విషయం తెల్సిందే.

చరణ్‌ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా చిత్రీకరణ లో పాల్గొంటున్నాడు. ఆ సినిమా తర్వాత గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ బ్యానర్‌ లో సినిమాను చరణ్ చేస్తాడు. జెర్సీ సినిమా తో మంచి విజయాన్ని సొంతం చేసుకున్న గౌతమ్‌ తిన్ననూరి ఒక విభిన్నమైన పాన్ ఇండియా సబ్జెక్ట్‌ ను చరణ్‌ కు వినిపించడం.. అది మెగా కాంపౌండ్‌ కు బాగా రీచ్‌ అవ్వడం జరిగిందట. అందుకే గౌతమ్ తిన్ననూరి కాంబోలో సినిమా ను చేస్తానంటూ హామీ ఇచ్చాడు.. త్వరలోనే ఆ సినిమా పట్టాలెక్కబోతుంది.

ఈ సమయంలోనే ఒక వెబ్‌ సిరీస్ ను కూడా చరణ్ చేసేందుకు సిద్దం అయ్యాడని తెలుస్తోంది. తెలుగు కు చెందిన స్టార్‌ హీరోలు ఓటీటీ ఎంట్రీకి సిద్దం అయ్యారు. ఈమద్య కాలంలో సినిమాలకు ఏమాత్రం తగ్గకుండా వెబ్‌ సిరీస్ లు ఉంటున్నాయి. పైగా వెబ్‌ సిరీస్ ల వల్ల ఎక్కువ మందికి రీచ్‌ అయ్యే అవకాశాలు కూడా ఉంటున్నాయి. అందుకే స్టార్స్ కూడా వెబ్‌ సిరీస్ ల వెంట పడుతున్నారు.

రామ్‌ చరణ్‌ వెబ్‌ సిరీస్ కు సంబంధించి ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఇప్పటికే ప్రముఖ ఓటీటీ లో స్ట్రీమింగ్‌ అవుతున్న ఒక సూపర్‌ హిట్‌ వెబ్‌ సిరీస్ ను ప్రముఖ దర్శకుడు ఇండియన్ ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లుగా... ఇక్కడ ప్రేక్షకుల యొక్క అభిప్రాయాలకు తగ్గట్లుగా మార్చి రీమేక్ చేసేందుకు సిద్దం అయ్యారంటూ విశ్వసనీయంగా సమాచారం అందుతోంది.

పాన్ ఇండియా సినిమా ల మాదిరిగానే పాన్ ఇండియా వెబ్‌ సిరీస్ రామ్‌ చరణ్ నుండి మొదలు అవ్వబోతుంది. హిందీ.. తెలుగు.. ఇంకా ఇతర సౌత్‌ భాషలు మరియు నార్త్‌ భాషల్లో చరణ్ మొదటి వెబ్‌ సిరీస్ ను స్ట్రీమింగ్‌ చేస్తారట. ఆ వెబ్‌ సిరీస్ ను బాలీవుడ్‌ ఫిల్మ్‌ మేకర్ తెరకెక్కించబోతుండగా ఒక ప్రముఖ ఓటీటీ సొంతంగా ఆ నిర్మించేందుకు సిద్దంగా ఉన్నట్లుగా సమాచారం అందుతోంది.

చరణ్ నిజంగానే వెబ్‌ సిరీస్ లో నటిస్తే ఖచ్చితంగా రాబోయే రెండు మూడు ఏళ్ల లో ఓటీటీ రంగంలో అద్బుతమైన కంటెంట్‌ ను బడా స్టార్‌ హీరోల నుండి ఆశించవచ్చు అంటున్నారు.
Tags:    

Similar News