73వ గణతంత్ర దినోత్సవ వేడుకలు దేశవ్యాప్తంగా కోవిడ్ నిబంధనల నడుమ సురక్షిత విధానంలో జరుగుతున్నాయి. రోజూ అనూహ్యంగా పెరుగుతున్న కేసుల వల్ల జాగ్రత్తలు తప్పనిసరి అయ్యాయి. అయితే చాలా మంది సెలబ్రిటీలు కోవిడ్ కి చికిత్స పొందుతూనే ఇండ్ల నుంచి జెండా వందనం చేస్తుండడం ఆసక్తికరం. ఈసారి సెకండ్ వేవ్ తో పోలిస్తే టెన్షన్ తక్కువ. థర్డ్ వేవ్ లో మానసిక ధృఢత్వంతో ప్రతి ఒక్కరూ వైరస్ భారి నుంచి కోలుకుంటున్నారు.
ఇంతకుముందు మెగాస్టార్ చిరంజీవి తనకు స్వల్ప కోవిడ్ లక్షణాలు కనిపించాయని ప్రకటించారు. తనని కలిసినవారంతా పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ఆయన ప్రస్తుతం గృహనిర్భంధంలో ఉన్నారు. అయినా జెండా వందనాన్ని మాత్రం విడిచిపెట్టలేదు.
``మన గొప్ప భారత రాజ్యాంగ మూల స్తంభాలకు వందనం: న్యాయం- సమానత్వం- స్వేచ్ఛ- సౌభ్రాతృత్వం.. మువ్వన్నెల జెండా అన్నివేళలా అంతెత్తున రెపరెపలాడుతుంది!`` అంటూ చిరు భావోద్వేగంగా ట్వీట్ చేశారు.
ఇక మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నేరుగా జెండా వందన కార్యక్రమంలోనే పాల్గొన్నారు. ప్రత్యేకించి ఆర్.ఆర్.ఆర్ లో యువ అధికారి తరహా లుక్ లో ప్లెయిన్ షర్ట్ లో కనిపించారు. ఈ లుక్ చూస్తుంటే చరణ్ తదుపరి ఆర్.సి.15 కోసం మేకోవర్ అని అర్థమవుతోంది. ఆర్సీ 15లో చరణ్ ఒక యువ ఐఏఎస్ అధికారిగా.. ముఖ్యమంత్రిగా ఎదిగినవాడిగా కనిపించనున్న సంగతి తెలిసిందే.