మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని, తెలుగుదేశం పార్టీని ప్రధానంగా టార్గెట్ చేస్తూ రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించి పొలిటికల్ సెటైరికల్ మూవీస్ 'లక్ష్మీస్ ఎన్టీఆర్', 'అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు'. ఈ సినిమాల తరువాత మళ్లీ మరో రాజకీయ సినిమాకు వర్మ శ్రీకారం చుట్టబోతున్నాడు. వివాదాస్పద అంశాలని తనకు అనుకూలంగా మలుచుకుంటూ ప్తర్యేక ప్యాకేజీలతో సినిమాలు రూపొందిస్తూ వస్తున్న రామ్ గోపాల్ వర్మ గురువారం తను తియ్యబోతున్న రాజకీయ మూవీని సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు.
ఇటీవల ఏపీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డిని ప్రత్యేకంగా కలిసిన రామ్ గోపాల్ వర్మ ఆ వెంటనే తాను రాజకీయ సినిమా తీయబోతున్నానని ప్రకటించడం ప్రాధాన్యతని సంతరించుకుంది. 'నేను అతి త్వరలో "వ్యూహం" అనే రాజకీయ సినిమా తియ్యబోతున్నాను ..ఇది బయోపిక్ కాదు... బయో పిక్ కన్నా లోతైన రియల్ పిక్. బయో పిక్ లో అయినా అబద్దాలు ఉండొచ్చు కానీ ,రియల్ పిక్ లో నూటికి నూరు పాళ్ళు నిజాలే ఉంటాయి.
అహంకారానికి , ఆశయానికి మధ్య జరిగిన పోరాటం నుండి ఉద్భవించిన "వ్యూహం" కధ , రాజకీయ కుట్రల విషం తో నిండి వుంటుంది .రాచ కురుపు పైన వేసిన కారం తో బొబ్బలెక్కిన ఆగ్రహానికి ప్రతికాష్టే 'వ్యూహం' చిత్రం. ఈ సినిమా 2 పార్ట్స్ గా రాబోతుంది.
మొదటి పార్ట్ 'వ్యూహం' , పార్ట్ 2 'శపథం'గా చేయబోతున్నాను. రెండింటిలోనూ రాజకీయ ఆరాచకీయాలు పుష్కలంగా వుంటాయి. రాష్ట్ర ప్రజలు మొదటి చిత్రం 'వ్యూహం' షాక్ నుంచి తెరుకునే లోపే వాళ్ళకి ఇంకో ఎలెక్ట్రిక్ షాక్ ని పార్ట్ 2 'శపథం' లో తగులుతుందని వర్మ చెప్పుకొచ్చాడు.
'వ్యూహం' సినిమాని గతంలో నాతో 'వంగవీటి' వంటి మూవీని నిర్మిచిన దాసరి కిరణ్ నిర్మిస్తారని,. ఎలక్షన్స్ టార్గెట్ గా ఈ చిత్రం తియ్యట్లేదని చెప్తే ఎవ్వరూ నమ్మరు కనక ఏం చెప్పాలో ఏం చెప్పకూడదో చెప్పాల్సిన అవసరం లేదని మీకు వేరే చెప్పక్కర్లేదు కనక చెప్పట్లేదు అంటూ వర్మ తాను చేస్తున్న సినిమాలు ఎలక్షన్స్ టార్గెట్ గా చేస్తున్నవేనని చెప్పేశాడు. మరి ఈ రాజకీయ సినిమాల్లో వర్మ నాణానికి ఒకవైపే చూపించాలని డిసైడ్ అయినట్టుగా తెలుస్తోందంటున్నారు.
ఇటీవల ఏపీ ముఖ్యమంత్రిని ప్రత్యేకంగా కలిసినప్పుడే క్లారిటీ వచ్చేసిందని నెటిజన్ లు వర్మపై కౌంటర్లు వేస్తున్నారు. వర్మ మాత్రం ఈసారి నూటికి నూరు పాళ్లు నిజాలే చెబుతాడట.. మరి ఏం జరగనుందో వర్మ 'ప్యూహం' , శపథం లతో ఎలాంటి రచ్చకు తెరలేపబోతున్నాడో వేచి చూడాల్సిందే.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.