రూ.40 కోట్ల దాకా బిజినెస్ చేసింది ‘ఓం నమో వేంకటేశాయ’. అక్కినేని నాగార్జున-రాఘవేంద్రరావు కాంబినేషన్ మీద ఉన్న నమ్మకంతో భారీ పెట్టుబడులే పెట్టారు బయ్యర్లు. కానీ సినిమా రాంగ్ టైమింగ్ లో రిలీజవ్వడంతో రిజల్ట్ తేడా వచ్చేసింది. వసూళ్లు మరీ అన్యాయంగా వచ్చాయి. పెట్టుబడిలో మూడో వంతు కూడా రికవర్ అయ్యేలా లేదు. ఈ సినిమా థియేట్రికల్ రన్ దాదాపుగా అయిపోవచ్చింది. బయ్యర్లకు భారీ నష్టాలు తప్పవని తేలిపోయింది. ఈ నేపథ్యంలో ఇక అందరి దృష్టీ.. శాటిలైట్ హక్కులు కొన్న రామోజీ రావు మీద పడింది. మామూలుగా ఈటీవీ ఛానెల్ పెద్ద సినిమాల శాటిలైట్ హక్కుల కోసం పోటీ పడదు. భారీ పెట్టుబడులు పెట్టదు. కానీ ‘ఓం నమో వేంకటేశాయ’ హక్కుల కోసం మాత్రం ఏకంగా రూ.11.5 కోట్లు పెట్టి ఆశ్చర్యపరిచింది. సినిమా థియేటర్లలో సరిగా ఆడని నేపథ్యంలో రామోజీకి కూడా పంచ్ పడుతుందేమో అని సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.
కానీ ‘ఓం నమో..’ విషయంలో ఈటీవీ వాళ్లు బేఫికర్ గానే ఉన్నట్లు తెలుస్తోంది. ఈటీవీలో ‘అన్నమయ్య’ సినిమాకు ఎంత మంచి ఆదరణ దక్కిందో తెలిసిందే. ఆ తర్వాత ‘శ్రీరామదాసు’ కూడా టీవీలో బ్లాక్ బస్టర్ అయింది. ప్రస్తుతం తెలుగు టెలివిజన్ చరిత్రలో అత్యధిక టీఆర్పీ రేటింగ్ ఉన్న సినిమా శ్రీరామదాసే కావడం విశేషం. కాబట్టి ‘ఓం నమో..’కు కూడా ఢోకా ఉండదని భావిస్తున్నారు. ఇలాంటి సినిమాలకు కుటుంబ ప్రేక్షకులే మహరాజ పోషకులు. కానీ పిల్లలంతా పరీక్షల హడావుడిలో ఉండటంతో ఫ్యామిలీస్ థియేటర్లకు రాలేదు. అందుకే వసూళ్లు లేవు. ఐతే ‘ఓం నమో..’ ప్రిమియర్ షో సమ్మర్లో మంచి టైమింగ్ చూసి రిలీజ్ చేశారంటే జనాలు బాగానే ఆదరించే అవకాశముంది. మంచి సినిమాగా పేరొచ్చింది కాబట్టి జనాలు సినిమాను ఫ్రీగా అంటే బాగానే చూస్తారు. థియేటర్లలో ఆడని కొన్ని సినిమాల్ని టీవీల్లో - యూట్యూబ్ లో సూపర్ హిట్ చేయడం మన జనాలకు అలవాటేలెండి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/