ఈ సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి - యువరత్న నందమూరి బాలకృష్ణ చిత్రాలు రిలీజ్ అవుతున్నాయి. దాదాపు తొమ్మిదేళ్ల విరామం తర్వాత ఖైదీ నెంబరు 150 చిత్రంతో చిరు రీ ఎంట్రీ ఇస్తుంటే... తన వందొ చిత్రంగా గౌతమీపుత్ర శాతకర్ణితో బాలయ్య బరిలోకి దిగుతున్నారు. చిరు చిత్రం ఈ నెల 11న ప్రేక్షకుల ముందుకు వస్తోంటే... ఒక రోజు ఆలస్యంగా బాలయ్య శాతకర్ణి ఈ నెల 12న రిలీజ్ కానుంది. ఇక సంక్రాంతికే ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు మరో రెండు చిత్రాలు కూడా సిద్ధంగా ఉన్నాయి. వీటిలో శర్వానంద్ నటించిన శతమానం భవతి - ఆర్.నారాయణమూర్తి నటించిన కానిస్టేబుల్ వెంకట్రామయ్య.
వీటిలో శతమానం భవతి చిత్రం రిజీల్ కు ఎలాంటి ఇబ్బందులు లేవు. ఎందుకంటే... దిల్ రాజు నిర్మాతగా ఉన్న ఈ చిత్రానికి అవసరమైనన్ని థియేటర్లు దొరికిపోయాయి. ఇక ఇబ్బంది అంతా నారాయణమూర్తి చిత్రానికే. కనీసం పట్టణానికి ఒక థియేటర్ అయినా ఇవ్వండంటూ నారాయణమూర్తి బహిరంగంగా వేడుకున్న విషయం... పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ఇట్టే తెలుస్తోంది. ఈ నేపథ్యంలో నారాయణ మూర్తిగా ఓ పెద్ద అండ లభించేసింది. మీడియా మొఘల్ రామోజీరావు... మూర్తిగా అండగా నిలిచారు. ప్రస్తుతం అనారోగ్యం కారణంగా బెడ్ పై నుంచి లేవలేని స్థితిలో ఉన్న రామోజీ... మూర్తి పడుతున్న ఇబ్బంది చూసి చలించిపోయారట. వెంటనే రంగంలోకి దిగిన ఆయన తన అనుచరులను పిలిచి నారాయణ మూర్తి ఇబ్బందులు తీర్చేయండని ఆదేశాలు జారీ చేశారట. అంతే క్షణాల్లో మూర్తి చిత్రానికి 100కు పైగా థియేటర్లు దొరికిపోయాయి.
ఎలాగంటే.. రామోజీ ఆధ్వర్యంలో మయూరి ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్ ఉన్న విషయం తెలిసిందేగా. దీని ద్వారానే ఆయా థియేటర్ల యాజమాన్యాలతో చర్చలు జరిపిన రామోజీ అనుచరగణం... నారాయణమూర్తి చిత్రానికి కావాలసిన థియేటర్లను సిద్ధం చేసేసినట్లు సమాచారం. ఈ క్రమంలోనే హైదరాబాదులోని సంధ్య 35ఎంఎం థియేటర్‌లోనూ కానిస్టేబుల్ వెంకట్రామయ్య రిలీజ్ కానుందట. లెఫ్టిస్ట్ భావాలున్న రామోజీ.. గతంలోనూ పలుమార్లు నారాయణమూర్తికి సాయం చేసిన సంగతి తెలిసిందే. పూర్వాశ్రమంలో నక్సల్స్ సానుభూతిపరుడిగా ఉన్న రామోజీ అంటే... నారాయణ మూర్తికి కూడా అభిమానమేనట. ఏదైతేనేం... రామోజీ సాయంతో నారాయణ మూర్తి చిత్రానికి ఎదురైన ఇబ్బందులు క్షణాల్లో తీరిపోగా... ఆయన అనుకున్నట్లే కానిస్టేబుల్ వెంకట్రామయ్య చిత్రం ఈ నెల 14న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/