మోహన్ బాబుకి సీనియర్ భామల రిక్వెస్ట్?

Update: 2015-12-25 09:30 GMT
మంచు మోహన్ బాబు జీవితంలో ఎంత డిసిప్లిన్డ్ గా ఉంటారో ఇండస్ట్రీలో అందరికీ తెలుసు. ముఖ్యంగా షూటింగ్ విషయంలో ఆయన వైఖరి చాలా ప్లాన్డ్ టైమింగ్ తో ఉంటుంది. గతంలో అయితే లేటుగా వచ్చిన కొంతమంది హీరోయిన్లను కూడా ఛెళ్లు మనిపించారని అంటారు. ఇప్పుడు మళ్లీ పాత తరం నటీమణులతో కలిసి నటించారు మోహన్ బాబు.

రమ్యకృష్ణ - మీనాలతో మామ మంచు అల్లుడు కంచు చిత్రం చేశారు. ఈ చిత్రం కోసం వారిని అడిగినపుడు.. మోహన్ బాబు ఎంత స్ట్రిక్ట్ గా ఉంటారో తెలుసు కాబట్టి.. వారు మంచు విష్ణును ఓ రిక్వెస్ట్ చేశారట. ఉదయాన్నే 7 గంటలకు బదులుగా.. 9 గంటలకు షూటింగ్ స్పాట్ కు చేరుకుంటామని అడగమన్నారట. ఈ విషయాన్ని తండ్రికి చేరవేయగా.. అంగీకరించిన మోహన్ బాబు కొన్ని రోజుల పాటు మాత్రం ఉదయాన్నే ఏడింటికే రావాలని సూచించారట. అయినా సరే.. వీళ్లిద్దరూ మాత్రం ఉదయాన్నే 7గంటలకే సెట్స్ చేరుకున్నారట. షూటింగ్ డేస్ అంతా ఇదే టైమ్ కి వచ్చేశారని తెలుస్తోంది. అందుకే 'ఓల్డ్ ఈజ్ గోల్డ్' అంటున్నారు మోహన్ బాబు.

అయితే.. గత 41 ఏళ్లుగా ఇదే డిసిప్లిన్ ఇంత స్ట్రిక్ట్ గా మోహన్ బాబు ఫాలో అవుతుండడం గ్రేట్ అనే చెప్పాలి. 'రోజుకు ఇంత అనే విధంగా పారితోషికం చెల్లిస్తున్నపుడు, తీసుకుంటున్నపుడు ఎందుకు లేట్ అవాలి ? ఓ ఫ్లైట్ టికెట్ కొనుగోలు చేసి.. లేట్ గా ఎయిర్ పోర్ట్ కి వెళ్తే కుదురుతుందా' అని ప్రశ్నిస్తున్నారు మోహన్ బాబు. దటీజ్ మోహన్ బాబు అనిపిస్తోంది కదూ.. 
Tags:    

Similar News