రమ్యకృష్ణ పంచ్‌.. పట్టించుకుంటున్నారా?

Update: 2015-07-19 15:35 GMT
మామూలుగా ఒక యాక్టర్‌ కాని, ఒక డైరక్టర్‌ కాని.. ఒక్క హిట్టు కొట్టాకే వారు ఏం చెప్పినా మిగిలిన వారు పట్టించుకుంటారు. అసలు శివగామి వంటి క్యారెక్టర్‌ చేయకపోతే రమ్యకృష్ణను ఎవరైనా ఇంటర్యూ చేసేవారా? చేస్తారా? అసలు మన మీడియాలో ఆమె గురించి ఒక్క కాలమ్న్‌ కూడా ఎవ్వరూ రాసిన పాపాన పోలేదు. కాని ఒక్కసారిగా శివగామిగా రమ్య తన సత్తాను చాటేశాక.. ఇక అందరూ ఆమె వైపునే చూస్తున్నారు.. అసలు తెలుగు ఫిలిం ఇండస్ట్రీ లో కొందరు 10 ఏళ్ళ నుండి పనిచేస్తూ తెలుగు లోనే మాట్లాడట్లేదు.. వారికి బాష రాకపోతే ఇక స్క్రీన్‌ మీద భావం ఏముంటుంది?

అయితే రమ్య లేవనెత్తిన ఈ పాయింట్‌ చాలాసార్లు చాలామంది లేవనెత్తారు. సమంత, తమన్నా వంటి భామలు తెలుగును దంచేస్తుంటే.. కాజల్‌, త్రిష వంటి భామలు తెలుగు నేర్చుకోకుండా తమకు వచ్చిందే చేస్తున్నారంటూ కామెంట్లు చేశారు. కాని ఏం లాభం.. ఈ పంచ్‌ లన్నీ పంచ్‌ లుగానే మిగిలిపోతున్నాయ్‌. తమకు ఏ హీరోయిన్‌ డేట్స్‌ దొరక్కపోతే బిల్డప్పులు ఇస్తున్న కాజల్‌ నే పిలిచి తీసుకోవాల్సి వస్తోంది. తెలుగు వచ్చినా రాకపోయినా ఏదో విధంగా వారి గ్లామర్‌ ను ఎక్సప్లోర్‌ చేసుకోవచ్చులే అనే ఫీలింగు తో ఉన్నారు జనాలు. అంతేకాని తెలుగు బాషకు ప్రాధాన్యం ఇవ్వట్లేదు.

అసలు రమ్యకృష్ణ కూడా తెలుగమ్మాయ్‌ కాదు. పక్కనే ఉన్న తమిళనాడు నుండి వచ్చింది. అటువంటి ఆ భామ తెలుగు లో శివగామికి డబ్బింగ్‌ చెబితే మైండ్‌ బ్లోయింగ్‌ అంటున్నారందరూ.. ఆ రేంజు హీరోయిన్లు త్వరలోనే తెలుగులో స్టార్లు అవుతారేమో చూద్దాం. ఇప్పుడున్న బంచ్‌ లో రకుల్‌ ప్రీత్‌, రెజీనా, రాశి ఖన్నాలు తెలుగు లో మాట్లాడటానికి బాగానే ప్రయత్నిస్తున్నారులే.
Tags:    

Similar News