నీలాంబరి క్యారెక్టర్ తర్వాత మళ్లీ అంతటి పవర్ ఫుల్ క్యారెక్టర్ శివగామి అన్న పేరొచ్చింది. రాజమాతగా రమ్యకృష్ణ నటనకి జనాలు జేజేలు పలికారు. అయితే ఈ రెండు పాత్రలు తనని వెతుక్కుంటూ ఎలా వచ్చాయి? అన్న సంగతిని ప్రశ్నిస్తే ఓ ఆసక్తికర విషయాన్ని రివీల్ చేశారు ఈ సీనియర్ నటి.
నీలాంబరి క్యారెక్టర్ పూర్తి నెగెటివ్ రోల్. అయినా ఆ క్యారెక్టర్ లో నటించమని ఎంతోమందిని సంప్రదించారు. దానికి ఏ కథానాయికా అంగీకరించలేదు. చివరికి అవకాశం నాకు దక్కింది. నేను ఓకే చెప్పాను. అయితే ఇప్పుడు శివగామి పాత్ర విషయంలో అలా కాదు. ఇది నేను ఎంతో ఇష్టపడి చేసిన పాత్ర. మనసా వాచా కర్మనా అభిమానించి చేసిన పాత్ర. రాజమౌళి కథ, నా పాత్రని చెప్పినప్పుడు రోమాలు నిక్కబొడుచుకున్నాయి అంటే అతిశయోక్తి కాదు. అందుకే అంగీకరించాను.. అని అసలు సంగతిని చెప్పారు రమ్య.
రమ్యకృష్ణ ముచ్చట్లను బట్టి నరసింహా చిత్రంలో నీలాంబరి క్యారెక్టర్ ని ఆఫర్ చేసినప్పుడు దానికోసం ఎగబడిపోలేదు. ఇష్టంతో అది ఒప్పుకోలేదు. ఒక ఛాలెంజ్ తీసుకోవడానికి మాత్రమే అంగీకరించారని అర్థమవుతోంది కదూ?