కుదిరితే హీరోయిన్ గా చేసేద్దామనే

Update: 2017-08-18 17:03 GMT
వయస్సుతో సంబంధం ఏముందిలే మనస్సుకు అంటుంటారు. కాని హీరోల విషయంలో మన సినీ జనాలు అది ఒప్పుకుంటారు కాని.. హీరోయిన్ల విషయంలో మాత్రం ఒప్పుకోరు. స్టార్ హీరోలు ఎలా ఉన్నా ఓకె కాని.. హీరోయిన్ అంటే మాత్రం యంగ్ అండ్ సెక్సీగా ఉండాల్సిందే. లేకపోతే ఆమెకు హీరోయిన్ గా పెద్దగా వేషాలే రావు. కాకపోతే 46 ఏళ్ళ వయస్సులో కూడా ఇంకా హీరోయిన్లకు పోటీ ఇస్తానంటోంది మన శివగామి.

బాహుబలి సినిమాతో భారీగా పేరు తెచ్చుకున్న రమ్యకృష్ణ.. ఇప్పుడు ఆ క్రేజును వెంటనే క్యాష్ చేసుకోవాలని చూడట్లేదు. కాకపోతే ఈవిడ వయస్సు మరో నాలుగేళ్లలో 50 టచ్ అవ్వబోతున్నా కూడా.. ఎంత హాటుగా ఉందో అందరికీ చూపిస్తోంది. ఈ మధ్యనే జెఎఫ్ డబ్లూ మ్యాగజైన్ కు ఫోటోషూట్ చేసిన రమ్య.. చాలా హాటుగా కూడా కనిపిస్తూ కొన్ని డ్రస్సులు వేసుకుంది. వాటిలో ఆమెను చూస్తే.. అబ్బా ఇంత హాటుగా ఉందేంటి.. కొంపతీసి కుదిరితే హీరోయిన్ గా చేసేద్దాం అనుకుంటుందా అని అడిగేవారూ ఉన్నారు.

నిజానికి ఆ మధ్యన సోగ్గాడే చిన్ని నాయన సినిమాలో ఒక పాటలో పక్కనున్న లావణ్య త్రిపాఠిని కూడా కనిపించకుండా చేస్తూ.. మన సౌత్ ఇండియాకు కూడా ఒక మాధురి దీక్షిత్ ఒక కాజోల్ తరహాలో లేటు వయస్సులో హాటుగా కనిపించే భామ ఒకరు ఉన్నారు అని ప్రూవ్ చేసిందిలే.
Tags:    

Similar News