గత కొంతకాలంగా దగ్గుఆటి రానా ఏదో అస్వస్థతతో బాధపడుతున్నాడని ఆపరేషన్ కోసం మరికొద్ది రోజులు అమెరికాలోనే ఉండాల్సి వస్తుందని రకరకాల వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. దానికి తోడు నిర్మాత సురేష్ బాబు ఓ సందర్భంలో రానాకు చికిత్స అవసరం అని చెప్పడం కంటికి సంబంధించి ఏదో వ్యాధి రానాను ఇబ్బంది పెడుతున్నట్టు తెలుసుకుని అభిమానులు కూడా ఆందోళన చెందారు. వాటికి పూర్తిగా చెక్ పెడుతూ రానా నిన్న జరిగిన 64వ జియో ఫిలిం ఫేర్ అవార్డ్స్ కు సంపూర్ణ ఆరోగ్యంగా కనిపించడంతో పాటు ఫిట్ గా అనిపించడం చూసి అందరూ రిలాక్స్ అయ్యారు. డాపర్ సూట్ లో దర్జాగా వచ్చిన రానా తనకు బాగా అచ్చివచ్చిన గెడ్డంతోనే అవార్డు తీసుకోవడానికి వచ్చాడు. నిజానికి అది తాజాగా చేస్తున్న హాథీ మేరె సాతి కోసం పెంచినది. రానా రావడం కొద్దిగా ఆలస్యం కావడంతో ముందే వచ్చిన సురేష్ బాబుని చూసి అందరికి కొంత అనుమానం కలిగిన మాట వాస్తవం.
వాటిని బ్రేక్ చేస్తూ రానా టైంకు చేరుకోవడంతో అన్ని సందేహాలకు రూట్ క్లియర్ అయ్యింది. ఒకవేళ ఏదైనా ఇన్ఫెక్షన్ లాంటివి ఉంటే కనక వాటి నుంచి రానా పూర్తిగా కోలుకున్నట్టే అని చెప్పొచ్చు. బాహుబలిలో తన పెర్ఫార్మన్స్ కి తీవ్రంగా పోటీ పడిన ప్రకాష్ రాజ్-సత్య రాజ్ లను పక్కకు నెట్టేసి మరీ ఫిలిం ఫేర్ బ్లాక్ లేడీని గెలుచుకున్న రానా హుషారుగానే కనిపించాడు. హాథీ మేరే సాతి తెలుగులో అరణ్య పేరుతో రానుంది. దీనితో పాటు స్వాతంత్రం పూర్వపు నేపథ్యంలో రూపొందుతున్న 1945లో కీలక పాత్ర పోషిస్తున్న రానా మార్తాండ వర్మగా మలయాళంలో కూడా ఎంట్రీ ఇవ్వనున్నాడు. ఏ భాషలో చేసినా అది ఎలాగూ తెలుగులో డబ్బింగ్ వెర్షన్ రూపంలో వస్తుంది కాబట్టి నో వర్రీ. రెండేళ్ల పాటు డైరీని పూర్తి బిజీగా మార్చుకున్న రానా కమర్షియల్ సినిమాలకు దూరంగా ప్రయోగాలకు సై టూ దూసుకుపోవడం మంచి పరిణామమే.