నాకే సినిమాల్లేవు...నీకు చాన్సా:రాణా

Update: 2018-06-27 15:05 GMT
టాలీవుడ్ హీరోల‌లో ద‌గ్గుబాటి రాణాకున్న ప్ర‌త్యేక‌తే వేరు. స్టేజి షోల‌లో హోస్ట్ గా - గెస్ట్ గా....ఇలా రెండు ర‌కాలుగా సంద‌డి చేయ‌డం రాణా స్పెషాలిటీ. ఐఫా-2017 అవార్డుల ప్ర‌దానోత్స‌వ కార్య‌క్ర‌మంలో వేదిక‌పై హోస్ట్ లుగా వ్య‌వ‌హ‌రించిన రాణా - నానిల కామెడీకి ఆహూతులు ఫిదా అయిన సంగతి తెలిసిందే. త‌న సినిమా ఫంక్ష‌న్ల‌తో త‌న స‌న్నిహితుల సినిమాల ఈవెంట్ల‌కు కూడా రాణా హాజ‌రై సంద‌డి చేస్తుంటాడు. తాజాగా, సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ బ్యానర్ లో త‌రుణ్ భాస్క‌ర్ తెర‌కెక్కించిన `ఈ న‌గ‌రానికి ఏమైంది` ప్రీ రిలీజ్ ఈవెంట్లో రాణా హ‌ల్ చ‌ల్  చేశాడు. క‌మెడియ‌న్ ప్రియ‌ద‌ర్శి - రాహుల్ ల‌తో పాటు వేదిక‌పై సంద‌డి చేశాడు. ఈ ముగ్గురి సంభాష‌ణ‌ను చూసిన ఆహూతులు పొట్ట చెక్క‌లయ్యేలా న‌వ్వుకున్నారు. రాహుల్ మిమ్మ‌ల్ని అడ‌గ‌మ‌న్నాడంటూ....రాణాను ప్రియ‌ద‌ర్శి అడిగిన ప్ర‌శ్న‌లు న‌వ్వుతెప్పించాయి.

రాణా సినిమాలో త‌మ‌కు ఫ్రెండ్స్ క్యారెక్ట‌ర్స్ ఇవ్వ‌మ‌ని ద‌ర్శి అడిగిన ప్ర‌శ్న‌కు రాణా ఫ‌న్నీగా ఆన్స‌ర్ ఇచ్చాడు. పెళ్లి చూపులు సినిమా క‌న్నా ముందు ....ఘాజీ సినిమాలోనే ద‌ర్శికి చాన్స్ ఇచ్చాన‌ని....ప్రియ‌ద‌ర్శిని ఇంట్ర‌డ్యూస్ చేసింది ఘాజీ టీమ్ అని రాణా అన్నాడు. మ‌రి త‌న‌కు చాన్స్ ఎపుడిస్తార‌ని రాహుల్ అడ‌గ‌డంతో....త‌న చేతిలోనే త‌క్కువ సినిమాలున్నాయ‌ని....మ‌ళ్లీ రాహుల్ కు చాన్స్ ఎక్క‌డ నుంచి ఇవ్వాల‌ని సెటైర్ వేశాడు. తానే విల‌న్ వేషాలు వేసుకుంటున్నాన‌ని....విల‌న్ కు బెస్ట్ ఫ్రెండ్స్ ఉండ‌రని పంచ్ వేశాడు. కొత్త హీరోల‌కు చాన్స్ ఇచ్చేందుకు సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ ఎపుడు ముందుంద‌ని, అందుకే ఇంత‌మంది కొత్త హీరోలు టాలీవుడ్ కు ప‌రిచయ‌మ‌వుతున్నార‌ని అన్నాడు. చాలా టాలెంటెడ్ వ్య‌క్తులు...ఒక టాలెంటెడ్ డైరెక్ట‌ర్ తో సినిమా తీశాడు...అని రాణా అన్నాడు. బాహుబ‌లిలో మీకండ‌లు ఒరిజిన‌లా కాదా...అని రాహుల్ అడుగుతున్నాడ‌ని ప్రియ‌ద‌ర్శి అడ‌గ‌డంతో ఆడిటోరియం న‌వ్వుల‌తో మార్మోగిపోయింది. ఏదో బెలూన్లు పెట్టుకొని మేనేజ్ చేశా అని రాణా సెటైరిక‌ల్ గా స‌మాధాన‌మిచ్చి....`ఈ న‌గ‌రానికి ఏమైంది` టీమ్ కు ఆల్ ది బెస్ట్ చెప్పాడు.
Tags:    

Similar News