ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా ఉధృతి ఎలా ఉందో తెలిసిందే. కొత్త రకం కరోనా లక్షణాల లు బయటపడటమే కాకుండా రోజు రోజుకు కేసులు పెరుగుతూ ఉన్నాయి. ఇప్పటికే కొన్ని చోట్ల కరోనా సెకండ్ వేవ్ ముందు జాగ్రత్తగా లాక్ డౌన్ కూడా పెడుతున్నారు. తెలంగాణలో సైతం విద్యాసంస్థలు అన్ని క్లోజ్ చేశారు. అయితే ప్రస్తుతం దేశంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితి గురించి తెలియజేయడానికి ఫిలిం ఫేర్ సంస్థ ఓ ట్వీట్ పెట్టింది. 'అరణ్య'లో దగ్గుబాటి రానా దిగాలుగా ఉన్న ఫోటోని జత చేస్తూ కరోనా సెకండ్ వేవ్ పాండమిక్ కి మన రియాక్షన్ ఇదేనంటూ పోస్ట్ చేసింది.
అయితే ఇందులో ఫిలిం ఫేర్ సంస్థ, రానా పేరు స్పెల్లింగ్ తప్పుగా రాశారు. దీంతో అదే విషయాన్ని ప్రస్తావిస్తూ ఫిలింఫేర్ కు రానా కౌంటర్ ఇచ్చాడు. ''మీరు నా పేరు తప్పుగా రాసిన ప్రతీసారి నా రియాక్షన్ కూడా ఇదే'' అంటూ ట్వీట్ వేశాడు. దీనికి స్పందించిన ఫిలింఫేర్.. 'అయ్యో! మేము మిమ్మల్ని చూసినప్పుడు అన్నీ పూర్తిగా మర్చిపోతాం రానా. క్షమించండి' అంటూ రానా పేరుని కరెక్ట్ గా మెన్షన్ చేస్తూ ట్వీట్ చేసింది. ప్రస్తుతం రానా - ఫిలింఫేర్ మధ్య ట్వీట్స్ వైరల్ అవుతున్నాయి.
ఇకపోతే రానా నటించిన తాజా త్రిభాషా చిత్రం 'అరణ్య' రేపు శుక్రవారం (మార్చి 26) ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో రానా సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటూ తన సినిమాను వీలైనంతగా ప్రమోట్ చేస్తున్నాడు. హిందీ వర్షన్ ‘హథీ మేరే సాథి’ కూడా రేపు విడుదల కావాల్సింది. కానీ బాలీవుడ్ మార్కెట్ పై ప్రస్తుతం కోవిడ్-19 ప్రభావం కారణంగా హిందీ వర్షన్ ని వాయిదా వేశారు.