‘లీడర్’ సినిమాలో రానా దగ్గుబాటి ఎలా ఉండేవాడో.. ఇప్పుడు ‘బాహుబలి’ సినిమాలో అతనెలా కనిపిస్తున్నాడో చూస్తున్నాం. కొత్తవాళ్లెవరికైనా రెండు ఫొటోలు పక్కపక్కన పెట్టి చూపిస్తే ఇద్దరూ వేర్వేరు అనుకుంటే అతిశయోక్తి ఏమీ లేదు. ఆ స్థాయిలో తన బాడీని మలుచుకున్నాడు రానా. టాలీవుడ్లోనే కాదు.. మొత్తం ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే అత్యంత ఫిట్ అయిన నటుల్లో అతనొకడు. బాలీవుడ్ హీరోలకు ఏమాత్రం తగ్గని స్థాయిలో బాడీ మెయింటైన్ చేస్తున్నాడు రానా. ఐతే దీని వెనుక రానా పడే కష్టం అంతా ఇంతా కాదంటున్నాడు అతడి ట్రైనర్ కునాల్ గిర్. రానా ఫిట్నెస్ మీద ఎంతగా దృష్టిపెడతాడో.. అతను ఇప్పుడున్న స్థితికి ఎలా వచ్చాడో కునాల్ మాటల్లోనే తెలుసుకుందాం పదండి.
‘‘ఎనిమిదేళ్ల కిందట.. లీడర్ సినిమాకు ముందు రానాను కలిశాను. అప్పట్లో తను చాలా సన్నగా ఉండేవాడు. ఐతే అతడి ఫిజిక్ కి వైడ్ స్ట్రక్చర్.. గుడ్ ఫ్రేమ్ ఉంటుంది. కఠినమైన డైట్.. వర్కవుట్ చేయాలి. అలా చేశాడు కాబట్టే ఇప్పుడు ఫిట్‌నెస్ కి సింబల్ లాగా మారాడు. ఒక వర్కవుట్ ముందు కష్టంగా అనిపిస్తుంది. తర్వాత ఈజీ అయిపోతుంది. కానీ మళ్లీ రానాకు కఠినంగా అనిపించేలా కొత్త వర్కవుట్ డిజైన్ చేస్తాను. రానా ఎక్కువగా వెయిట్ ట్రైనింగ్ వర్కవుట్స్ చేస్తాడు. హెవీ వెయిట్స్ ద్వారా కేలరీలు బాగా ఖర్చు చేయగలడు రానా. వారంలో కనీసం ఐదు రోజులు.. కొన్ని గంటల పాటు వ్యాయామం చేస్తాడు. హైదరాబాద్ లో లేకున్నా సరే.. వర్కవుట్లు మాత్రం మిస్సవడు. అతడి వెంట ఎప్పుడూ నా అసిస్టెంట్ ఒకరు ఉంటారు. ఈ మధ్య చెన్నైలోని ఒక మారుమూల గ్రామంలో షూటింగుకి వెళ్లాడు రానా. అక్కడికి కూడా నా అసిస్టెంట్ తోడుగా వెళ్లాడు. డైట్ క్యారెక్టర్లకు తగ్గట్లుగా మారుస్తుంటాడు రానా. రోజుకు ఎనిమిదిసార్లు మీల్స్ తీసుకుంటాడు. అందులో చాలా వరకూ హై ప్రొటీన్ ఉంటుంది’’ అని కునాల్ గిర్ తెలిపాడు.