దగ్గుబాటి రానా ఓ బైక్ కొనుక్కన్నాడు. అలాగని ఇదేమీ బాగా ఖరీదైన బైక్ కాదు. బజాజ్ 'వీ' పేరుతో ఆ కంపెనీ తయారు చేసిన లేటెస్ట్ మోడల్ 150 సీసీ బైక్ అంతే. కాస్ట్ అయితే.. ఆన్ రోడ్ ప్రైస్ 70వేల రూపాయల వరకూ ఉంటుంది. రానా లాంటి సెలబ్రిటీ.. ఈ మాత్రం ధరతో ఓ బైక్ కొనడం చాలా సింపుల్ మేటర్. కానీ రానా కొత్త బైక్ ట్రెండింగ్ అవడానికి ఓ ప్రత్యేకమైన కారణం ఉంది.
లేటెస్ట్ మూవీ ఘాజీ ప్రమోషన్స్ కోసం బజాజ్ వి ని కొనుగోలు చేశాడు రానా. రెండింటికీ లింక్ ఏంటి అనుకోవచ్చు కానీ.. అదే అసలు కహానీ. చరిత్ర ప్రకారం పాకిస్తాన్ సబ్మెరైన్ పీఎన్ఎస్ ఘాజీ.. ఇండియన్ సబ్మెరైన్ ఎస్ 21 పై దాడి చేస్తుంది. ఘాజీ తునాతునకలు అయిన విషయాన్ని కొన్ని నెలల తర్వాత.. ఐఎన్ఎస్ విక్రాంత్ అనే ఇండియన్ సబ్మెరైన్ గుర్తిస్తుంది. ఈ ఐఎన్ఎస్ విక్రాంత్ కు సంబంధించిన మెటల్ ను ఉపయోగించి.. 'విక్రాంత్'ను ప్రతిబింబించేలా లేటెస్ట్ మోడల్ కు 'వి' అనే పేరు పెట్టింది బజాజ్ కంపెనీ.
ఇప్పటికే బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్ దగ్గర కూడా ఈ బైక్ ఒకటి ఉంది. ఇప్పుడు రానా కూడా ఆ విషయం తెలిసిన తర్వాత.. బజాజ్ 'వి' బైక్ ను కొనుగోలు చేశాడు. ఈ బైక్ తన దగ్గర ఉండడం గర్వంగా అనిపిస్తోందని చెప్పాడు రానా.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/