ఒకే దెబ్బకి రెండు పిట్టల్ని కొట్టాడు రానా. బాహుబలిలోని బల్లాలదేవ క్యారక్టర్ యొక్క సూపర్ సక్సెస్‌తో ఇప్పుడు అతడికి ఆఫర్ల వెల్లువ మొదలైంది. ఓ వైపు సినిమా అవకాశాలు, మరోవైపు వాణిజ్య ప్రకటనలతో దిమ్మతిరిగిపోయే కాంట్రాక్టులు. అసలు ఈ రేంజ్ వస్తుందని రానా సైతం ఊహించి ఉండడు. మహేష్, బన్ని, చరణ్ తర్వాత ఇక మనోడిదే ఛాన్స్. ముఖ్యంగా ఈ ఆరడుగుల ఆజానుభాహుడు భళ్లాలదేవగా చేసిన పెర్ఫామెన్స్ కార్పొరెట్ ప్రపంచాన్ని షాక్‌కి గురి చేసినట్టుంది. ఇప్పుడు ఇంటా బైటా ప్రఖ్యాత బ్రాండ్‌ల కంపెనీలన్నీ రానా నామ జపం చేస్తున్నాయి.
నిన్ననే రానా ఓ ప్రఖ్యాత వాచ్ బ్రాండ్ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుని సంతకాలు పూర్తి చేశాడు. ఈ సందర్భంగా జరిగిన ఓ అధికారిక ప్రెస్‌మీట్‌లో షూటు బూటులో తళుకులీనాడు. కనీసం 45000 నుంచి 65000 మధ్య ధరలు పలికే 'టిస్సాట్' వాచీలకు ప్రమోటర్‌గా ఎంపికయ్యాడు. యూత్‌లో రానాకి పెరిగిన ఇమేజ్‌ను దృష్టిలో పెట్టుకుని సదరు సంస్థ ఈ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. రానా ఇప్పుడు ఇంటర్నేషనల్ ఫిగర్. అందుకే ఇంటర్నేషనల్ బ్రాండ్స్ అన్నీ ఇలా వెంటపడుతున్నాయి. మునుముందు అటు బాలీవుడ్ నుంచి ఆఫర్ల వెల్లువ సిద్ధంగా ఉంది. టాలీవుడ్, కోలీవుడ్‌లోనూ అంతే ఫేమస్ అయిపోయాడు కాబట్టి భారీ పారితోషికాలిచ్చి అవకాశాలివ్వడం ఖాయం. ఒకే దెబ్బకి ఒకటి కాదు రెండు కాదు పది పిట్టలు పడినట్టే మరి.