రానా నాకు షాక్ ఇచ్చాడు: సురేష్ బాబు

Update: 2018-09-06 08:35 GMT
తెలుగు ఇండస్ట్రీలో మనకున్న హీరోల్లో రానా ఒక మంచి నటుడు.  నటన.. మంచి తెలుగు డిక్షన్ తో పాటుగా పాత్రలో పరకాయ ప్రవేశం చేసేందుకు ఎంత శ్రమకైనా సిద్ధం అంటాడు రానా.  ఇతర ఫిల్మీ నేపథ్యం ఉన్న వారిలా మాస్ హీరో ఇమేజ్ కోసం వెంపర్లాడకుండా మంచి పాత్రలు.. డిఫరెంట్ కంటెంట్ ఉన్న సినిమాలు అంగీకరిస్తూ తనకంటూ ఒక స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు.

క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న నందమూరి బాలకృష్ణ తాజా చిత్రం 'ఎన్టీఆర్' లో  రానా దగ్గుబాటి ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమాకోసం ఇప్పటికే స్లిమ్ గా మారి కొత్త గెటప్ లోకిమారి న సంగతి తెలిసిందే.  క్లీన్ షేవ్ చేసుకొని - మీసాలతో రానా కొత్తగా కనిపిస్తున్నాడు.  రానా కొత్త గెటప్ గురించి రానా నాన్నగారు సురేష్ బాబు రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడారు. షూటింగ్ లొకేషన్ లో చంద్రబాబు గెటప్ లో ఉన్న రానా తనకు షాక్ ఇచ్చాడని అన్నారు.  ఆ గెటప్ లో చంద్రబాబు లాగానే నిలబడడం చూసినవారు రానాను చంద్రబాబు కాదంటే ఎవరూ నమ్మలేరని అన్నారు.  మొత్తానికి రానా తన తండ్రికి పుత్రోత్సాహం కలిగేలా చేశాడు.

అంతా బాగానే ఉంది గానీ రానా బాబుగారి పాత్రలో ఎక్కువగా లీనమై ఆ తర్వాత రియల్ లైఫ్ లో కట్టప్ప లక్షణాలు కూడా వస్తేనే డేంజరని సోషల్ మీడియా లో చిలిపి నెటిజనులు కామెంట్ చేస్తున్నారు.  విమర్శించే నోళ్ళు ఎప్పుడూ ఎదోకటి అనకుండా ఊరుకుంటాయా? దాని సంగతి పక్కన బెడితే 'ఎన్టీఆర్' సినిమాలో రానా పాత్ర మాత్రం ఒక హైలైట్ గా ఉండబోతోందని మాత్రం మనకు అర్థం అవుతోంది.
Tags:    

Similar News