కెరీర్ ఆరంభంలో సోలో హీరో వేషాలు వేసిన రానా దగ్గుబాటి రెండు మూడేళ్ల నుంచి డిఫరెంట్ రూట్లో సాగిపోతున్నాడు. గెస్ట్ రోల్స్, విలన్ పాత్రలు చేస్తూ తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నాడు. ఐతే ఇప్పుడు మళ్లీ అతడి దృష్టి సోలో హీరో వేషాలపై పడుతున్నట్లుంది. వచ్చే ఏడాది రానా హీరోగా రెండు సినిమాలు రాబోతున్నాయి. అందులో ఒకటి ఘాజి అనే టైటిల్ తో రాబోతున్న మల్టీ లాంగ్వేజ్ ఫిలిం. పీవీపీ సినిమాస్ ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తోంది. సంకల్ప్ రెడ్డి అనే కొత్త దర్శకుడు ఈ సినిమాను రూపొందించనున్నాడు.
ఈ మధ్యే క్రిష్ డైరెక్ట్ చేసిన కంచె.. రెండో ప్రపంచ యుద్ధం నేపథ్యంలో తెరకెక్కిన తొలి ఇండియన్ మూవీగా గుర్తింపు తెచ్చుకుంది. రానా సినిమా కూడా అలాంటి ఫస్ట్ ఎవర్ మూవీ కాబోతోంది. ఇండియాలో రాబోతున్న తొలి సబ్ మెరైన్ వార్ ఫేర్ ఫిలింగా దీన్ని చెబుతున్నారు. ఇలాంటి కాన్సెప్ట్ తో హాలీవుడ్ లో మాత్రమే సినిమాలు వచ్చాయి. 1971 ఇండియా-పాకిస్థాన్ యుద్ధం సందర్భంగా సముద్రంలో మునిగిపోయిన పాకిస్థాన్ సబ్ మెరైన్ ఘాజి చుట్టూ ఉన్న మిస్టరీ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కనుంది.సమంతను ఈ సినిమాకు హీరోయిన్ గా అనుకుంటున్నారు. ప్రస్తుతం ప్రి ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. త్వరలోనే సినిమా మొదలవుతుంది.