కొన్నిసార్లు అదృష్టం ఎలా కలిసొస్తుందో ఎవరూ ముందే ఊహించలేరు. కొన్ని ప్లాన్డ్ గా సెటప్ చేసేవి అయితే, మరికొన్ని అనుకోకుండా తగిలే లక్ ఫ్యాక్టర్ అని చెప్పొచ్చు. రానా లైఫ్ లో అలాంటి లక్ ఫ్యాక్టర్ బాగా వర్కవుటవుతోందనే చెప్పాలి. ఎస్.ఎస్.రాజమౌళి `బాహుబలి` చిత్రంలో భళ్లాలదేవ క్యారెక్టర్ రానాకు ఆఫర్ చేయడం ఒక స్నేహంతో కూడుకున్న సెటప్ అని అనుకుంటే - ఇప్పుడు `హౌస్ ఫుల్ 4` చిత్రంలో అవకాశం ఒక లక్ ఫ్యాక్టర్ అని చెప్పాలి. రానాకు బాలీవుడ్ లో బిగ్ కాంటాక్ట్స్ ఉన్న మాట నిజమే కానీ, ఈ చిత్రం నుంచి నానా పటేకర్ తప్పుకోకపోతే పరిస్థితేంటి? ఆ సన్నివేశం క్రియేటవ్వడం అన్నది తనకి కలిసొచ్చిన మేజర్ అంశం అనే చెప్పాలి.
అక్టోబర్ లో జరిగిన కొన్ని పరిణామాలతో సీనియర్ నటుడు నానా పటేకర్ ఈ చిత్రం నుంచి తప్పుకున్నాడు. అంత పెద్ద స్టార్ కోసం రాసుకున్న పాత్రకు దర్శకరచయిత ఫర్హాద్ సామ్జీ రానానే ఏరికోరి ఎంపిక చేసుకున్నాడంటే అది ఓ రకంగా ఆయాచితంగా కలిసొచ్చిన అదృష్టం అనే భావించాలి. తనూశ్రీ దత్తా వేదింపుల వ్యవహారంలో నానా పటేకర్ ఆరోపణలు ఎదుర్కోవడం ప్రాజెక్టు నుంచి ఉద్వాసనకు కారణమైంది. అలాగే ఈ చిత్రానికి దర్శకత్వం వహించాల్సిన సాజిద్ ఖాన్ అదే తరహాలో లైంగిక ఆరోపణల వల్లనే తప్పుకున్నాడు. అలా ఫర్హాద్ సామ్జీ తెరపైకి వచ్చాక .. రానాకు ఛాన్సొచ్చింది.
ఇంతకీ `హౌస్ ఫుల్ 4` చిత్రంలో కిలాడీ అక్షయ్ కుమార్ - రితేష్ దేశ్ ముఖ్ - బాబి డియోల్ లాంటి బెస్ట్ స్టార్లు ఉండగా - రానా చేసేది ఏంటి? అంటే దానికి సమాధానం తాజాగా దర్శకుడే తెలిపారు. ఈ చిత్రంలో రానా పాత్ర ఒక `థ్రెట్` అని సీక్రెట్ ని ఓపెన్ చేసేశారు. ఈ పాత్ర గురించి ఇప్పుడే చెప్పేయడం సరికాదు.. అయితే రానా పాత్ర సినిమాలో ఎంతో కీలకమైనది అని తెలిపారు. రానా థ్రెట్ అంటే అతడే విలన్ అని అర్థమవుతోంది. మొత్తానికి రానా రొట్టె విరిగి నెయ్యిలో పడిందనే చెప్పాలి. ఈ చిత్రంలో అతడు నటుడిగా మరో స్థాయిని చూపించే ఛాన్సుంది. బాలీవుడ్ లో మోస్ట్ సక్సెస్ ఫుల్ ఫ్రాంఛైజీగా పేరున్న `హౌస్ ఫుల్` సిరీస్ లో అతడికి ఇకపైనా ఛాన్స్ లుంటాయి. అలాగే దర్శకుడు ఫర్హాన్ సామ్జీ బాలీవుడ్ లోనే పెద్ద రచయిత. ప్రస్తుతం రోహిత్ శెట్టి తెరకెక్కించనున్న `గోల్ మాల్ 5` చిత్రానికి ఇతడే కథ అందిస్తున్నాడు. అందులో కూడా రానాకు ఓ క్యారెక్టర్ పడిందంటే ఇక అంతే సంగతి. రానా బాలీవుడ్ లోనూ మరో లెవల్ ని టచ్ చేస్తాడనడంలో సందేహం లేదు. మరోవైపు రానా టాలీవుడ్ లోనూ బిజీ స్టార్ అన్న సంగతి తెలిసిందే.
Full View