ఇప్పుడు సూపర్ స్టార్స్ కూడా టివిలో కనిపించడానికి టివి ద్వారా జనాలకు మరింత దగ్గర కావడానికి టివి షోలును ఒక వేదికగా చేసుకుంటున్నారు. ఇండియాలో దీనికి ఆది గురువు బిగ్ బి అమితాబ్ అని చెప్పవచ్చు. ఆ తరవాత చాలా రియాలిటీ షోలకు మన స్టార్స్ హోస్ట్ గా చేసినవి గొప్ప హిట్ అయ్యాయి. ఇప్పుడు మన తెలుగులో కూడా అలానే మొదలు అయ్యింది. మెగాస్టార్ చిరంజీవి ఈ మధ్యనే 'మీలో ఎవరు కోటీశ్వరుడు' షో హోస్టు చేశారు. ఇక ‘బిగ్ బాస్’ ను తెలుగు లో నిర్మించబోతున్నారు దానికి యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ గా చేస్తున్నారు.
ఇప్పుడు అదే బాటలో మరో యంగ్ హీరో బాహుబలి నటుడు రానా దగ్గుబాటి హోస్ట్ గా తెలుగులో మరో తాజా టివి షోతో మన ముందుకు రాబోతున్నాడు. ఇది ఇప్పటికే షూటింగ్ మొదలై కొన్ని ఎపిసోడ్లు కూడా షూట్ చేశారని అని తెలుస్తుంది. తెలుగులో మునుపు ఎన్నడూ చూడని టివి షో అని చెబుతున్నారు. ఈ షో లో మన స్టార్స్ వచ్చి వాళ్ళ స్నేహాలు గురించి వాళ్ళ జీవితాలలో ముఖ్య సంఘటనలు గురించి పంచుకుంటారు అని చెబుతున్నారు. ఈ కాన్సెప్ట్ జనాలుకు కొత్తదనంతో పాటుగా చాలా ప్రేరణగా కూడా ఉంటుంది అని షో డిజైన్ చేసినవాళ్లు చెబుతున్నారు.
ఇండస్ట్రి లో అందరితోనూ మంచి సంబంధాలు ఉన్న రానా ఈ స్టార్ పోగ్రామ్ కి సరైన ఎంపిక అని వాళ్ళు బలంగా నమ్ముతున్నారట. మన తెలుగులో కాఫి విత్ కరణ్ లాంటి కాస్త వైవిధ్యం ఉన్న షో లు తక్కవే అనే చెప్పాలి. మరీ చూడాలి రామానాయుడు గారి మనవడు ఏమి చేస్తాడో ఎలా ముందుకు తీసుకువెళ్తాడో.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/