రానా - మిహికా ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ స్టార్ట్ అయ్యాయి...!

Update: 2020-06-21 14:40 GMT
దగ్గుబాటి రానా ఇటీవలే తన ప్రేమ విషయాన్ని చెప్పి అందరిని సర్‌ ప్రైజ్ చేసిన సంగతి తెలిసిందే. త‌న ప్రేమ‌కి గ్రీన్ సిగ్న‌ల్ లభించిందని పేర్కొంటూ ప్రేయసి మిహికా బజాజ్‌ ని పరిచయం చేశారు రానా. ఇటీవల రోకా ఫంక్షన్ నిర్వహించిన ఇరు కుటుంబాలు పెళ్లి తేదీని కూడా ప్రకటించారు. రానా - మిహికా బజాజ్‌ ల వివాహం ఆగ‌స్ట్ 8న జరపాలని పెద్దలు నిర్ణయించారు. రానా ప్రేమ విష‌యాన్ని ప్ర‌క‌టించిన కొద్ది రోజుల్లోనే పెళ్లి ముహూర్తం పెట్టేసుకోవ‌డం విశేషం. రానా తండ్రి సురేష్ బాబు ఈ విషయాన్ని వెల్లడిస్తూ ప్రభుత్వ గైడ్ లైన్స్ ఫాలో అవుతూ ఇరు కుటుంబాలు మరియు సన్నిహితుల మధ్య వివాహ వేడుక జరగనుందని వెల్లడించారు. కాగా ఇరు కుటుంబాలు రానా - మిహికా పెళ్లి కోసం ఇప్ప‌టి నుంచే ప‌నుల్లో మునిగిపోయారని తెలుస్తోంది.

దగ్గుబాటి వారి కాబోయే కోడలు మిహికా బ‌జాజ్ తన ఇన్‌స్టాగ్రామ్‌ లో ఈ విష‌యాన్ని వెల్ల‌డించింది. ''సెలబ్రేషన్స్ కంటిన్యూ అవుతాయి. ఈ రోజుని మరింత ప్రత్యేకంగా చేసినందుకు మీకు ధన్యవాదాలు'' అని పోస్ట్ పెట్టారు. ట్రెడిషనల్ లుక్ లో ఉన్న త‌న ఫొటోను షేర్ చేసింది. ఇందులో మిహికా బజాజ్ సాంప్రదాయ వస్త్రాల్లో రాయ‌ల్ లుక్‌ లో మెరిసిపోతోంది. ధ‌గ‌ధ‌గ మెరిసిపోతున్న న‌గ‌లు ధ‌రించిన ఆమె చిరున‌వ్వులు చిందిస్తోంది. ఆమె ముఖంలో పెళ్లి క‌ళ కొట్టొచిన‌ట్లు కనబడుతోంది. ఈ ఫొటో చూస్తుంటే ప్రీ వెడ్డింగ్ ఫొటో షూట్ ప్రారంభ‌మైన‌ట్లే అని తెలుస్తోంది. హైద‌రాబాద్‌ లో ఈ పెళ్లి వేడుక‌ను నిర్వహిస్తామని చెప్పినప్పటికీ ఎక్క‌డనేది ఇంకా వెల్ల‌డించ‌లేదు. అయితే వీరి వివాహ వేడుక ప్రతిష్టాత్మకమైన తాజ్ ఫలక్ నుమా ప్యాలెస్ లో వైభవంగా నిర్వహించబోతున్నారని వార్తలు వస్తున్నాయి.

Tags:    

Similar News