ఈ హీరోకి వ్యాపారాలూ ఇంపార్టెంటే

Update: 2016-12-16 22:30 GMT
2010లో లీడర్ తో సినిమా హీరోగా అరంగేట్రం చేసినా.. దగ్గుబాటి రానా కెరీర్ ఊపందుకోవడానికి బాహుబలి వరకూ వెయిట్ చేయాల్సి వచ్చింది. ఆ లోపే బాలీవుడ్ సహా సినిమాలు చేసినా పేరొచ్చింది తప్ప.. ప్రయోజనం లేదు. అన్నేళ్ల పాటు ఎదురుచూసిన ఫేమ్ అందిన తర్వాత.. సహజంగా ఎవరైనా యాక్టింగ్ లో తెగ బిజీ అయిపోతారు. కానీ రానా మాత్రం సినిమాల్లో యాక్టింగ్ కంటే వ్యాపారాల పైనా ఇంట్రెస్ట్ అంటున్నాడట.

రీసెంట్ గా ఓ ట్యాలెంట్ మేనేజ్మెంట్ ఏజెన్సీతో కలిసి పార్ట్నర్ అయ్యాడు రానా. తారలకు అవకాశాలు అందేలా చేయడం లాంటివాటిలో కూడా తెగ బిజీగా ఉన్నారు. రెండూ కూడా చేసేయచ్చు కానీ.. ప్రస్తుతం రానా చేస్తున్న సినిమాల లిస్ట్ చూస్తే ఓ విషయం అర్ధమవుతుంది. హిందీ-తెలుగుల్లో ద్వి భాషా చిత్రంగా రూపొందుతున్న ఘాజీ.. దర్శకుడు తేజతో చరిత్ర మినహాయిస్తే.. ప్రస్తుతం రానా చేతిలో సినిమాలు లేవు. చిన్నప్పటి నుంచి తనకు ఎంతో ఇష్టమైన వ్యాపారాల నిర్వహణపైనే దృష్టి పెట్టడంతోనే.. సినిమాలపై అంతగా ఫోకస్ చేయడం లేదట రానా.

అసలు యాక్టింగ్ కెరీర్ స్టార్ట్ చేయకముంద..  రానాకి స్పిరిట్ మీడియా అనే సంస్థ ఉండేది. సినిమాలకు సంబంధించి పోస్ట్ ప్రొడక్షన్ పనులు చూడ్డం దీని పని. అప్పట్లో సైనికుడు మూవీకి గాను బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్ విభాగంలో నంది అవార్డ్ కూడా అందుకున్నాడు. కానీ ఆ వెంచర్ నష్టాలకు గురవడంతో మూసేయాల్సి వచ్చింది. ఇప్పుడు మళ్లీ మరింత జాగ్రత్తగా బిజినెస్ లను నిర్వహించబోతున్నాడట రానా.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News