టాలీవుడ్ లో పైకి కనిపించని పోటీ ఉందా? స్టార్ హీరోల మధ్య ఛాలెంజ్ అంతకంతకు వేడెక్కిస్తోందా? అంటే అవుననే అర్థమవుతోంది. స్టార్ల మధ్య నువ్వా? నేనా? అన్న కాంపిటీషన్ కనిపిస్తోంది. ఆ క్రమంలోనే బాక్సాఫీస్ పోటీ అంతకంతకు పెరుగుతోంది. ఒక స్టార్ హీరో సినిమా రిలీజ్ కి వస్తోంది అంటే .. అంతకుమించి మనం ఎలాంటి రికార్డులు బ్రేక్ చేయాలి? అన్న పంతం కనిపిస్తోంది. బాహుబలి సిరీస్ తర్వాత అలాంటి రికార్డులు కొట్టేసే సినిమా తీయాలన్న పంతం దేశవ్యాప్తంగా ఎలా పెరిగిందో - అలానే తెలుగు సినిమాల్లోనూ అంతర్గత వార్ అంతే ఇదిగా పెరిగింది.
స్టార్ హీరోలు రిలీజ్ కి రిలీజ్ కి మధ్య కొంత గ్యాప్ మెయింటెయిన్ చేస్తూనే రేసులో మేం కూడా ఉన్నామని చెప్పకనే చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఈ సమ్మర్ లో `మహర్షి` తర్వాత వచ్చే భారీ చిత్రాలపై ప్రస్తుతం ఆసక్తికర చర్చ సాగుతోంది. ఆ తర్వాత రెబల్ స్టార్ ప్రభాస్ `సాహో` - మెగాస్టార్ చిరంజీవి `సైరా` పోటీ బరిలో ఉన్నాయి. ఆగస్టు 15న `సాహో` రిలీజవుతోంది అని ఇప్పటికే అధికారికంగా ప్రకటించేసిన యువి క్రియేషన్స్ టీమ్ ప్రచారానికి ఆయుధాల్ని ఇప్పటి నుంచే రెడీ చేస్తోంది. ముందుగా `షేడ్స్ ఆఫ్ సాహో మేకింగ్- 2` విజువల్స్ ని బరిలో దించుతోంది. మార్చి 3న ఈ వీడియో ఎలాంటి ప్రకంపనాలకు తావిస్తోందోనన్న చర్చా సాగుతోంది ఇప్పటికే. మరోవైపు పోటీబరిలో నువ్వా నేనా? అంటూ మెగాస్టార్ చిరంజీవి వచ్చేస్తున్నారంటూ మీడియాలో ఇటీవల ప్రచారం మొదలైంది. అక్టోబర్ లో సైరా రిలీజవుతుందని తొలుత ప్రచారం సాగినా.. ఇంకాస్త ముందుగానే బరిలో దిగే ఛాన్సుందంటూ మరో కొత్త పుకార్ వినిపిస్తోంది. అయితే దీనికి సంబంధించి కొణిదెల ప్రొడక్షన్స్ కంపెనీ అధినేత రామ్ చరణ్ కానీ.. ప్రొడక్షన్ కంపెనీ ప్రతినిధి కానీ స్పష్టతనివ్వలేదు. అయితే సాహో తర్వాత మరో జియాంట్ బాక్సాఫీస్ వారియర్ మూవీ ఏది? అంటే కచ్ఛితంగా `సైరా- నరసింహారెడ్డి` పేరు వినిపిస్తోంది. సైరా టీజర్ - పోస్టర్ సహా కాస్టింగ్ వ్యవహారం జాతీయ స్థాయిలో మార్మోగుతోంది. ఇటీవల సరిగా ప్రచారార్భాటం లేకపోవడంతో కొంత ఈ సినిమా మరుగున పడిన మాట వాస్తవం. అయితే తొందర్లోనే సైరా టీమ్ నుంచి అదిరిపోయే అప్ డేట్ రానుందని తెలుస్తోంది. 2019 మోస్ట్ అవైటెడ్ మూవీస్ లో సాహో - సైరా పేర్లు స్పష్టంగా వినిపిస్తున్నాయనడంలో సందేహం లేదు.
మరి ఈ ఏడాదిలో ఆ రెండిటితో పోటీగా మరో భారీ చిత్రం ఏదీ లేదా? అంటే.. ఎందుకు లేదు? భళ్లాల దేవ రానా నటిస్తున్న `హాథీ మేరే సాథీ` బరిలో ఉంది. ఇప్పటికే ఈ సినిమా మెజారిటీ పార్ట్ చిత్రీకరణ పూర్తయిందని తెలుస్తోంది. హిందీ - తెలుగు - తమిళ భాషల్లో అత్యంత భారీగా ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నారు. స్పెక్టాక్యులర్ అన్న పదానికి కేరాఫ్ అడ్రెస్ గా ఈ చిత్రాన్ని అడవుల బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిస్తున్నారు. గ్రాఫిక్స్ లో అద్భుతమైన ఎండుటడవి (నిర్జీవమైన అడవి)ని క్రియేట్ చేస్తున్నారని ఇదివరకూ ప్రచారమైంది. వాస్తవానికి ఈ చిత్రం ఈపాటికే రిలీజ్ కావాల్సింది. మారిన కాన్వాసులో .. భారీ బడ్జెట్ తో (100 కోట్లు పైగా) ఈ చిత్రం హీట్ పెంచేస్తోంది. 5 అక్టోబర్ 2018 కి రిలీజ్ చేయాలని భావించినా గ్రాఫిక్స్ వల్ల ఆలస్యం అవుతోంది. మొత్తానికి హాతీ మేరే సాథీ పనులు వేగంగా పూర్తవుతున్నాయని రామానాయుడు స్టూడియోస్ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఈ సినిమా చిత్రీకరణ సహా `హౌస్ ఫుల్ 4` చిత్రీరణ పూర్తి చేసుకుని మార్చిలో రానా వేరొక తెలుగు సినిమాకి సంతకం చేయబోతున్నారట. ఆ మేరకు విశ్వసనీయ సమాచారం అందింది. 1971లో రాజేష్ ఖన్నా ప్రధాన పాత్రలో వచ్చిన హిందీ చిత్రం `హాథీ మేరే సాథీ`కి మోడ్రనైజ్డ్ వెర్షన్ గా రానా చిత్రం తెరకెక్కుతోంది. ప్రభు సాల్మన్ దర్శకత్వం వహిస్తున్నారు. సాహో - సైరా చిత్రాలకు ధీటైన పోటీ ఇచ్చే చిత్రమిదన్న ప్రచారం సాగుతోంది. మరి ఇది సమ్మర్ లో రిలీజ్ కి వస్తోందన్న ప్రచారంలో నిజం ఎంతో చిత్రయూనిట్ కన్ఫామ్ చేయాల్సి ఉందింకా. 2019లో ఈ మూడు భారీ సినిమాల మధ్య బాక్సాఫీస్ రికార్డుల గురించి ముచ్చట ఖాయమేనని భావించాల్సి ఉంటుంది.