నిర్జీవ‌మైన అడ‌విలో భ‌ళ్లాలుడు

Update: 2019-01-09 07:08 GMT
రాజేష్ ఖ‌న్నా `హాథీ మేరా సాథీ` (1971) రీమేక్ లో రానా న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. గ‌జ‌రాజు (కుంకీ) ఫేం ప్ర‌భు సోల్మ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిస్తున్నారు. ఈ సినిమా భారీ విజువ‌ల్ గ్రాఫిక్స్ బేస్ చేసుకుని ఓ డిఫ‌రెంట్ టోన్ లో ద‌ర్శ‌కుడు తెర‌కెక్కిస్తున్నాడ‌ని తెలుస్తోంది. హిందీ, త‌మిళ్, తెలుగులో ఏక‌కాలంలో చిత్రీక‌ర‌ణ సాగుతోంది. అడ‌వి బ్యాక్ డ్రాప్ లో ఆద్యంతం ఉత్కంఠ రేపే ఎమోష‌న‌ల్ డ్రామా ఉన్న చిత్ర‌మిద‌ని తెలుస్తోంది. 

తాజా సమాచారం ప్ర‌కారం... ఈ సినిమా మొత్తం నిర్జీవ‌మైన ఎండుట‌డివి బ్యాక్ డ్రాప్ లో తెర‌కెక్కుతుందిట‌. వాస్త‌వానికి అడ‌వి బ్యాక్ డ్రాప్ అన‌గానే..  ప‌చ్చ‌ని అడ‌వుల నేప‌థ్యంలో ఈ చిత్రం తెర‌కెక్కుతోంద‌ని జ‌నం క‌న్ఫ్యూజ్ అయ్యారు. ఈ సినిమా అప్ డేట్ గురించి  ఇటీవ‌ల‌ రామానాయుడు స్టూడియోస్ లో నిర్మాత డి.సురేష్ బాబును ప్ర‌శ్నిస్తే ఆస‌క్తిక‌ర స‌మాధానం ఇచ్చారు. పూర్తిగా నిర్జీవ‌మైన అడ‌విలో ఈ క‌థ సాగుతుంద‌ని ఆయ‌న తెలిపారు. ఏనుగుతో పాటు, మొత్తం 12 ర‌కాల జంతువుల‌తో రానా ప‌య‌నం సాగుతుంటుంది. చెట్లు అన్నీ ఎండిపోయి.. ఆకులు రాలిపోయి.. అడ‌వి అంతా ఓ కొత్త ర‌కం ఫీల్ ని క‌లిగిస్తుంద‌ని సురేష్ బాబు చెప్పారు.. ప్ర‌భు సోల్మ‌న్ తెర‌కెక్కించిన గ‌జ‌రాజు (గుంకీ) ప‌చ్చ‌ని అడ‌వుల్లో ఉంటుంది. దానికి పూర్తి ఆపోజిట్ గా డిఫ‌రెంట్ క‌ల‌ర్ గ్రేడింగ్ బ్యాక్ డ్రాప్ లో ఈ చిత్రం ఉంటుంద‌ని తెలిపారు. ఇది 300 త‌ర‌హా క‌ల‌ర్ గ్రేడింగ్ తో ఉంటుందా? అని ప్ర‌శ్నిస్తే అలా ఉండ‌దు.. కానీ కొత్త‌గా ఉంటుంద‌ని అన్నారు. అంటే ప‌చ్చ‌ని అడ‌విలో తెర‌కెక్కించినా అవ‌స‌రం మేర నిర్జీవ‌మైన అడ‌విని గ్రాఫిక్స్ లో క్రియేట్ చేస్తార‌ని, బ్లూమ్యాట్, గ్రీన్ మ్యాట్ ఫార్మాట్ ని ఉప‌యోగిస్తార‌ని తెలుస్తోంది.

ఇదివ‌ర‌కూ తొలి షెడ్యూల్ థాయ్ ల్యాండ్ అడ‌వుల్లో పూర్త‌యింది. రెండో షెడ్యూల్ షూటింగ్ కేరళ అడవుల్లో ఇటీవ‌లే ప్రారంభమైంది. అక్క‌డ హీరో రానాపై కీల‌క స‌న్నివేశాల్ని తెర‌కెక్కిస్తున్నారు. వాస్త‌వానికి గ‌త‌ ఏడాది దీపావళికే సినిమా రిలీజ్ చేస్తార‌ని అనుకున్నా, అంత‌కంత‌కు ఆల‌స్య‌మ‌వుతోంది. రానా మ‌రోవైపు క‌థానాయ‌కుడు చిత్రంలో చంద్ర‌బాబు పాత్ర‌లో న‌టించిన సంగ‌తి తెలిసిందే. 2019 దీపావ‌ళి లేదా ద‌స‌రా నాటికి అయినా `హాథీ మేరి సాథీ` చిత్రం రిలీజ‌వుతుందా? అంటూ ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. ఈ చిత్రాన్ని తెలుగులో `అరణ్య`, తమిళంలో `కాదన్` అనే టైటిల్స్ తో తెర‌కెక్కిస్తున్నారు.



Full View
Tags:    

Similar News