ఏ ముహూర్తాన హీరో పాత్రల్ని వదిలేసి.. క్యారక్టర్ - విలన్ రోల్స్ లోకి మారాడో అప్పుడే మారిపోయింది రానా జాతకం. తెలుగు - తమిళం - హిందీ భాషల్లో అద్భుతమైన పాత్రలతో దూసుకెళ్లిపోతున్నాడు. ముఖ్యంగా ‘బాహుబలి’ తర్వాత అతడి ఇమేజ్ అమాంతం పెరిగిపోయింది. ప్రస్తుతం అతడి కోసం మూడు భాషల వాళ్లూ పోటీ పడుతున్నారు. పెద్ద పెద్ద సినిమాల్లో కీలక పాత్రలు ఇస్తున్నారు. ప్రస్తుతం రానా చేతిలో బాహుబలి-2 సహా అరడజను సినిమాలున్నాయి. ఇంతలో రానా బాబుకి మరో బంపర్ ఆఫర్ తగిలింది. ఫేమస్ తమిళ దర్శకుడు గౌతమ్ మీనన్ దర్శకత్వంలో రానా ఓ సినిమా చేయబోతున్నాడు. ఇంకో విశేషం ఏంటంటే.. ఆ సినిమాలో హీరో ధనుష్.
ఎన్నై నొక్కి పాయుమ్ తొట్ట.. ఇదీ ధనుష్ - గౌతమ్ మీనన్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా. సోమవారం నాడే ఈ సినిమా షూటింగ్ మొదలైంది. ఈ సినిమాలో రానా సైతం ఓ కీలక పాత్ర చేయబోతున్నట్లు వెల్లడైంది. బహుశా అది నెగెటివ్ క్యారెక్టరే అయి ఉండొచ్చని అంటున్నారు. గౌతమ్ సినిమాల్లో విలన్ పాత్రలు చాలా బలంగా ఉంటాయి. కాక్క కాక్క (తెలుగులో ఘర్షణ) - రాఘవన్ - ఎంతవాడు గానీ సినిమాల్లో విలన్ పాత్రలు అద్భుతంగా పండాయి. నటులను సరికొత్తగా ప్రెజెంట్ చేయడంలో గౌతమ్ స్టయిలే వేరు. మరి అలాంటి డైరెక్టర్ ఏరికోరి రానాను ఎంచుకున్నాడంటే అది స్పెషల్ క్యారెక్టరే అయి ఉంటుంది. ఈ సినిమాలో మేఘా ఆకాష్ అనే కొత్తమ్మాయి హీరోయిన్ గా నటిస్తోంది. రానా నటిస్తున్నాడు కాబట్టి.. ఈ సినిమా ఆటోమేటిగ్గా తెలుగులోనూ విడుదలవుతుందన్నమాటే.