`బాహుబలి`తో ఘన విజయాన్ని సొంతం చేసుకొన్నాడు రానా. ఆయనకి దరిదాపుగా హీరో ప్రభాస్ రేంజ్ లో పేరొచ్చింది. హిందీలోనైతే ప్రభాస్ కంటే ఎక్కువ మార్కులు రానాకే పడ్డాయి. ఆ విజయాన్ని నిలబెట్టుకోవాలని, అందుకు ధీటైన సినిమాల్ని ఇకపై కూడా చేయాలని రానా ఇప్పుడు అడుగులు వేస్తున్నాడు. అందులో భాగంగా ఆయన తదుపరి ఓ సబ్ మెరైన్ సినిమా చేయబోతున్నట్టు సమాచారం. హైదరాబాద్ కి చెందిన సంకల్ప్ అనే దర్శకుడు హిందీతో పాటు, తెలుగులోనూ ఆ సినిమాని తెరకెక్కించబోతున్నట్టు సమాచారం. 70ల్లో ఇండియా-పాక్ మధ్య జరిగిన యుద్ధం నేపథ్యంలో ఆ సినిమా తెరకెక్కుతున్నట్టు సమాచారం. బ్లూ ఫిష్ అనే పుస్తకాన్ని ఆధారంగా చేసుకొని ఆ సినిమాని తెరకెక్కించబోతున్నట్టు వార్తలొస్తున్నాయి.
రానా ఆ సినిమా చేస్తున్నదే నిజమైతే తెలుగులో తొలి సబ్ మెరైన్ చిత్రం చేసిన కథానాయకుడిగా రికార్డుల్లోకి ఎక్కుతాడు. కథ రీత్యా సినిమా మొత్తం నీళ్లలోనే ఉంటుందట. అందులోనే వార్ ఎపిసోడ్స్, అందులోనే డ్రామా ఉండేలా కథని సిద్ధం చేశారట. సింక్ సౌండ్ ఆధారంగా సినిమాని తెరకెక్కిస్తారని, దీంతో ఆ సన్నివేశాలు మరింత ఎఫెక్టివ్ గా నాచురల్ గా వస్తాయని చిత్రబృందం అంచనా వేస్తోంది. తెరపై రానా నేవీ అధికారిగా కనిపిస్తాడట. ప్రకాష్ రాజ్ కీలక పాత్ర పోషిస్తాడు. ఇప్పటికే రానాకి కథ చెప్పడంతో పాటు ఆయన ఓకే కూడా అనేశారట. ఈ సినిమా కాన్సెప్ట్ లోనే క్యురియాసిటీ కనిపిస్తోంది కాబట్టి... కథ కూడా అందుకు ధీటుగా ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక వివరాలు వెల్లడయ్యే అవకాశాలున్నాయి. ప్రస్తుతం రానా `బాహుబలి2` పనులతో బిజీగా ఉన్నారు. ఆ చిత్రం పూర్తయ్యాకే రానా కొత్త చిత్రం చేసే అవకాశాలున్నాయి.