స్టార్ డమ్ చట్రంలో ఇమిడిపోయి రొటీన్ చిత్రాలు చేసుకుపోయే వారికి అపోజిట్ వేలో దూసుకెళ్తున్నారు రానా. ఆయన ఎంచుకుంటున్న చిత్రాలే ఇందుకు నిదర్శనం. బాహుబలి, ఘాజీ, విరాటపర్వం, అరణ్య.. ఇలా ఒకదానికి మరొకటి సంబంధం లేని కథల్లో నటిస్తూ వైవిద్యాన్ని ప్రదర్శిస్తున్నారు. తనలోని నటుడిని సంతృప్తి పరుచుకోవడంతోపాటు ప్రేక్షకులకూ సరికొత్త అనుభూతిని పంచుతున్నారు.
బాహుబలిలో భల్లాలదేవగా ఆసేతుహిమాచలాన్ని అలరించిన రానా.. ఘాజీలో కెప్టెన్ అర్జున్ గా సత్తాచాటారు. విరాట పర్వంలో నక్సలైట్ గా.. అరణ్యలో కార్పొరేట్ శక్తులకు వ్యతిరేకంగా పోరాడే అడవి బిడ్డగా.. వర్సటైల్ పెర్ఫార్మెన్స్ తో అదరగొడుతున్నారు.
కాగా.. అరణ్య సినిమాకు సంబంధించిన పలు విశేషాలను ఆయన పంచుకున్నారు. ఈ సినిమాలో వీఎఫ్ ఎక్స్ వర్క్ కు స్కోప్ ఉన్నప్పటికీ.. నేచురల్ గా ఉండాలనే ఉద్దేశంతో రియల్ గానే షూటింగ్ కొనసాగించినట్టు తెలిపారు. ఈ క్రమంలో.. 18 ఏనుగులను షూటింగ్ లో భాగంచేసినట్లు తెలిపారు.
వాటితో కలిసి జీవించే వ్యక్తిగా నటించడానికి చాలా ఇబ్బంది పడ్డట్టు తెలిపారు రానా. ఏనుగులు ఏ క్షణంలో ఎలా ప్రవర్తిస్తాయో తెలియదు. అలాంటి వాటి మధ్య అప్రమత్తంగా ఉంటూ చిత్రీకరణలో పాల్గొన్నానని తెలిపారు. అయితే.. ఏదైనా తేడా జరిగితే వాటిని కంట్రోల్ చేసేందుకు తన వద్ద ఆయుధాలను కూడా సిద్ధం చేసుకున్నట్టు తెలిపారు.
అవేంటంటే.. ఒకటి అరటిపండు, మరొకటి చిన్న బెల్లం ముక్క. ఇవి రెండూ తన జేబులో ఎప్పటికీ ఉండేవని చెప్పారు రానా. అరటి పండ్లంటే ఏనుగులకు ఎంత ఇష్టమో తెలిసిందే. అవి అందించి బుజ్జగిస్తే.. వెంటనే కూల్ అయిపోతాయి. ఇక, బెల్లం ముక్క కూడా అంతే. అందుకే.. వీటిని వెంట ఉంచుకొని షూటింగ్ లో మేనేజ్ చేసినట్టు చెప్పారు.