నేనే టేబుల్.. నాదే లాభం

Update: 2017-07-26 04:56 GMT
ఒక్కోసారి లక్ కలిసొస్తే.. అసలు సినిమా పూర్తికాక మునుపే ఆ సినిమాకు సంబంధించి బడ్జెట్ అడ్వాన్సుల రూపంలో వచ్చేస్తోంది. ఒక్కోసారి పూర్తయిన సినిమాను టేబుల్ ప్రాఫిట్స్ కే అమ్మేస్తుంటారు. ఇప్పుడు రానా హీరోగా రూపొందిన ''నేనే రాజు నేనే మంత్రి'' సినిమా కూడా అదే బాటలో ఉంది. పైగా మ్యాటర్ ఏంటంటే.. ఇక్కడ అంతా తానై సురేష్‌ బాబు చూసుకుంటున్నారు కాబట్టి.. నేనే టేబుల్ నాదే లాభం అన్నట్లు ఆయన దగ్గరుండి బాగానే వర్కవుట్ చేయించారు.

రానా హీరోగా తేజ డైరెక్టర్ గా వస్తున్న సినిమా నేనే రాజు నేనే మంత్రి ఇంకా విడుదల కాలేదు అప్పుడే లాభాలు బాట పట్టింది. హీరో డైరెక్టర్ తీసుకున్న రెమ్యూనిరేషన్లు కాకుండా ఈ సినిమా బడ్జెట్ 11 కోట్లు. ఈ సినిమా శాటిలైట్ రైట్స్ కూడా బాగానే పలికాయి. తెలుగు డిజిటల్ రైట్స్ 2.5 కోట్లు - తెలుగు శాటిలైట్ 3 కోట్లు - తమిళ్ శాటిలైట్ 2 కోట్లు - హిందీ శాటిలైట్ 7 కోట్లు - హిందీ డిజిటల్ రైట్స్ 2.5 కోట్లు - మళయాలం శాటిలైట్ 1.5 కోట్లు. మొత్తం కలిపితే 19.5 కోట్లు. సినిమా మొదలుపెట్టినప్పుడు బడ్జెట్ పెద్దగా ఏమి లేకుండా స్టార్ట్ చేశారు. హీరోకి డైరెక్టర్ కి ఏదో ఇవ్వాలి కదా అని కొంత మొత్తం ఇచ్చారు. ఇప్పుడు ఈ సినిమా క్రేజ్ చూస్తే నేమో కచ్చితంగా బాక్స్ ఆఫీసు లాభాలు పండించేలా కనిపిస్తుంది. దానితో ప్రొడ్యూసర్ సురేశ్ బాబు థియేటర్ రైట్స్ ఎవరికి అమ్మకుండా తానే డిస్ట్రిబ్యూటర్ గా చేస్తే ఎలా ఉంటుంది అని ఆలోచిస్తున్నాడు.

అయితే డబ్బులు పెట్టిన మెయిన్ నిర్మాతలు భరత్ చౌదరి - కిరణ్ రెడ్డి మాత్రం ఇలా చేయడానికి కొంచెం  భయపడుతున్నారంట. సినిమా పై మంచి అంచనాలే ఉన్నాయి ప్రతి ఏరియాలో అడిగే వారు కూడా  చాలా మంది ఉన్నారు అమ్మేస్తే పని తెగిపోతుంది కదా అంటే సురేశ్ బాబు ఏమో ఉండండి తొందరపడకండి అంటున్నాడట. ఇక ధియేటర్ల దగ్గర యుద్దం చేయవలిసింది రానా అయితే సారధ్యం చేయబోతున్నది మాత్రం సురేశ్ బాబు అన్నమాట.  
Tags:    

Similar News