తేజను ఇంకా కరుణించని భల్లాలదేవ

Update: 2016-05-31 04:45 GMT
దర్శకుడు తేజ తను మళ్లీ ఫామ్ లోకి వచ్చేందుకు తెగ ప్రయత్నాలు చేస్తున్నాడు. అందులో భాగంగా కొత్త ప్రాజెక్టులను తెగ అనౌన్స్ చేసేస్తున్నాడు. వాటిలో ఒకటి రానాతో కూడా ఉంది. రానా - కాజల్ అగర్వాల్ జంటగా ఓ లవ్ స్టోరీ తీయబోతున్నానని.. షూటింగ్ వెంటనే మొదలైపోతుందని కూడా చెప్పాడు తేజ.

అయితే.. తేజతో సినిమాకి రానా ఒప్పుకున్న ఇంకా డేట్స్ ఇవ్వలేదని తెలుస్తోంది. ఇప్పుడు బాహుబలి ది కంక్లూజన్ షూటింగ్ ప్రారంభం కానుండడంతో.. వరుసగా జక్కన్నకి డేట్స్ ఇచ్చేశాడట రానా. బాహుబలి షూటింగ్ లో పాల్గొనే లోపు కూడా.. ఆ మూవీ చైనీస్ వెర్షన్ ప్రచారం చేస్తున్నాడు. అంటే కొన్ని నెలలపాటు భల్లాలదేవుడు జక్కన్నకే అంకితం అయిపోతాడన్న మాట. అంటే.. తేజతో సినిమా షూటింగ్ ప్రారంభం అవ్వాలంటే.. రానా ఫ్రీ అయ్యాకే అన్న విషయం అర్ధమవుతోంది.

మరోవైపు తేజతో సినిమా ఒక్కటే కాజల్ చేతిలో ఉంది. కెరీర్ కీలకమైన దశలో ఉండగా.. సర్దార్ గబ్బర్ సింగ్ - బ్రహ్మోత్సవం ఆఫర్స్ ని చేజిక్కించుకోవడంతో సంతోషించిన కాజల్.. ఆ రెండు సినిమాలు ఫెయిల్ అవడంతో.. తీవ్రంగా నిరాశపడింది. కనీసం తేజ దర్శకత్వంలో రానాతో చేసే సినిమా అయినా సక్సెస్ సాధించి.. తనకు పూర్వ వైభవం తెచ్చిపెడుతుందని ఆశలు పెట్టుకుంటే.. ఇది ఎప్పుడు స్టార్ట్ అవుతుందో తెలీని పరిస్థితి.
Tags:    

Similar News