సింపుల్ గా లిడర్ సినిమాతో కెరీర్ ను మొదలు పెట్టి ప్రతి సినిమాకి ఒక్కో వెరీయేషన్ ను చూపిస్తూ.. నటుడిగా తానేంటో నీరూపించుకుంటున్నాడు రానా. ప్రస్తుతం ఈ హీరో సక్సెస్ ట్రాక్ లో ఉన్నాడనే చెప్పాలి. బాహుబలి ఏ స్థాయిలో హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక ఘజి లాంటి ఓ కొత్త తరహా చిత్రాన్ని తెరకెక్కించి పెద్ద ప్రయోగమే చేశాడు ఈ దగ్గుపాటి హీరో.
ఇలా వరుస ప్రయోగా లతో హిట్ అందుకున్న రానా ప్రస్తుతం తెలివిజన్ రంగంలో కూడా బాగానే క్లిక్ అయ్యాడు. అతను చేసిన "నెంబర్ వన్ యారి" షో కూడా బుల్లి తెర ప్రేక్షకులని తెగ ఆకట్టుకుంటోంది. ఈ వయసులోనే రానా అన్ని తరహా పాత్రలను.. పనులను చేసేస్తున్నారు. సీనియర్ హీరోలు అయిన నాగార్జున- చిరంజీవి "మీలో ఎవరు కోటీశ్వరుడు" తో ఏ స్థాయిలో ఆకట్టుకున్నారో తెలిసిన విషయమే. అలాగే రానా కంటే ముందు చలన చిత్రం లోకి అడుగుపెట్టిన జూనియర్ ఎన్టీఆర్ కూడా బిగ్ బాస్ షోతో అలరిస్తున్నాడు. ఇక రానా తనదైన శైలిలో నెం.1 యారి ని హిట్ చేశాడు.
అయితే ఇది మరవకముందే ఇప్పుడు మరొక కొత్త తరహాలో రాబోతున్నాడు రానా. ప్రస్తుత రోజుల్లో చాలా మంది అగ్ర నటులు వెబ్ సిరీస్ పై కన్నేస్తున్నారు. ఇక రానా కూడా త్వరలో వెబ్ సిరీస్ తో రావాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలిపాడు. అయితే వెబ్ సిరీస్ లకి మార్కెట్ అంత బాలేదని రానా చెబుతున్నాడు. అంతే కాకుండా బడ్జెట్ విషయం గురించి కూడా కొంత ఆలోచిస్తున్నట్లు వివరించాడు. కానీ కొందరు ప్రముఖ తారలు ఆ దారిలో ఓ అడుగు వేద్దామని అనుకుంటున్నారట. మరి రానా అలా అన్నాడు అంటే ఖచ్చితంగా ఎదో విషయం ఉండాలి. ఇక రానా నటించిన నేనే రాజు నేనే మంత్రి శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది.