ధృవ ఈవెంట్: ప్చ్.. ధృవ బాహుబలి!!

Update: 2016-12-05 04:19 GMT

హీరో రానా దగ్గుబాటి చిన్నప్పటి నుండి రామ్ చరణ్‌ కు చాలా క్లోజ్ ఫ్రెండ్ అనే విషయం తెలిసిందే. అయితే మనోళ్లు ఇద్దరూ కలసి చదువుకునే రోజుల్లో.. తన జీవితంలో బిగ్గెస్ట్ విలన్ అల్లు అరవింద్ గారు అంటూ చాలాసార్లు చెప్పాడు రానా. ఎందుకంటే చిన్నపాటి అల్లరి చేసినా కూడా అది చిరంజీవి గారికి సురేష్‌ బాబు గారికి చేరవేశేవాడట ఈయన. ఇదే విషయాలను మరోసారి ధృవ ప్రీ రిలీజ్ ఈవెంట్లో గుర్తు చేశాడు మన భల్లాలదేవ.

''మేం చదువుకునే రోజుల్లో ఈ గ్రౌండుతో చాలా సంబంధం ఉంది. అంటే మేం పెద్దగా చదువుకోలేదులే. కాని ఇలా అరవింద్ గారి ముందు మాట్లాడాలంటే మాత్రం నాకు భయంగానే ఉంది'' అంటూ చెప్పుకొచ్చాడు రానా.  అంటే మనోళ్లు యుసూఫ్‌ గుడ పోలీస్ లైన్స్ గ్రౌండ్స్ కు దగ్గర్లో ఉన్న సెయింట్ మేరిస్ కాలేజీలో చదివారులే. అందుకే ఈ పోలీస్ గ్రౌండ్స్ తో అంత కనక్షన్.

ఇకపోతే రానా ఇచ్చిన ఒక ఫినిషింగ్ పంచ్ మాత్రం కాస్త అతిగా అనిపించింది. ''ధృవ ఖచ్చితంగా పెద్ద హిట్టు అవ్వాలి. బాహుబలి రేంజులో హిట్టవ్వాలి అని మనస్పూర్తిగా కోరుకుంటున్నా'' అంటూ చెప్పాడు. అయ్యా రానా వారూ.. మీ బెస్ట్ ఫ్రెండ్ సినిమా కాబట్టి ఆ రేంజులో కోరుకోవడంలో తప్పులేదు.. కాని బాహుబలితో కంపారిజన్ ఎలా? హౌ?

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News