టాటూతో ప్రేమ తెలిపిన హీరో లవర్

Update: 2020-05-20 17:25 GMT
తెలుగు ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రానా దగ్గుబాటి. కొద్దిరోజులలో పెళ్ళికొడుకు కాబోతున్నాడని అర్ధమవుతుంది. ఆరడుగుల పైనే ఎత్తు.. హాలీవుడ్ హీరో స్ట్రక్చర్ తో పాటు రానా నటనకు లేడీ ఫ్యాన్స్ కూడా బాగానే ఉన్నారు. ఈ మధ్య రానా ఎక్కడికి వెళ్లినా ప్రతీ ఒక్కరూ పెళ్లి గురించే అడుగుతున్నారని.. గత వారం తన ప్రేమ గురించి క్లారిటీ ఇచ్చేసాడు. ఇదివరకు పెళ్లితో పాటు గర్ల్ ఫ్రెండ్ ఎవరని కూడా అడిగేవారు. ఇలాంటి ప్రశ్నలన్నింటికీ రానా సమాధానం ఇచ్చేసాడు. త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నానంటూ.. సోషల్ మీడియాలో అనౌన్స్ చేసి అందరినీ సర్‌ప్రైజ్ చేసాడు. ఇక తన గర్ల్‌ఫ్రెండ్ మిహీకా బజాజ్‌ ని కూడా ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పరిచయం చేశాడు. అంతేగాక మిహీకాతో దిగిన సెల్ఫీ ఫొటోను కూడా షేర్ చేస్తూ.. ‘ఆమె నాకు ఎస్ చెప్పింది’ అని అలా చెప్పాడో లేదో.. నిశ్చితార్థం అంటూ హడావిడి మొదలైంది.

అయితే తెలివిగా పెళ్లి డేట్, ఎంగేజ్‌మెంట్ లాంటి విషయాలను మాత్రం సీక్రెట్ గా దాచాడు. ఇక ఈరోజు సాయంత్రం 4గంటలకు నిశితార్థం అంటూ వార్తలొచ్చాయి కానీ అది కేవలం ఫ్యామిలీ మీటింగ్ అని తెలిసింది. ఇక వీరిద్దరూ ప్రేమ గురించి అలా బయట పెట్టారో లేదో.. ఆ వెంటనే ఒకరి గురించి ఒకరు సోషల్ మీడియాలో లవ్ మేటర్ షేర్ చేసుకుంటున్నారు. ఇక ఎంతో గోప్యంగా ఇంతకాలం దాచిన మిహీక.. తాజాగా తన కాబోయే భర్త రానా.. పేరును, తన పేరును షార్ట్ కట్ లో చేతి పై టాటూ వేయించుకుందట. ఆ టాటూ ఫోటో ఈరోజు ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసింది. ఎప్పుడైతే రానాతో ప్రేమ విషయం బయట పడిందో.. అప్పుడే టాటూకి మెరుగులు దిద్దిందట మిహీక. ఇంతకాలం సీక్రెట్ గా మెయింటైన్ చేసిన ప్రేమను ఇకనుండి అలా చేయాల్సిన అవసరం లేదని అనుకుంటున్నారేమో.. అంటూ రానా ఫ్యాన్స్ మాట్లాడుకుంటున్నారు.
Tags:    

Similar News