రానా చంద్ర‌బాబుగా ముస్తాబు

Update: 2018-08-03 06:25 GMT
అంతా అనుకుంటున్న‌ట్టుగానే చంద్ర‌బాబు నాయుడు పాత్ర‌లో రానా సంద‌డి చేయ‌బోతున్నారు.  చారిత్రాత్మ‌క‌మైన `ఎన్టీఆర్` బ‌యోపిక్‌ లో కీల‌క‌మైన బాబు పాత్ర చేయాల్సిందే అని రానాని ద‌ర్శ‌కుడు క్రిష్ ప‌ట్టుబ‌ట్ట‌డంతో ఆయ‌న ఓకే చెప్పేశారు. ఇటీవ‌లే రానాపై టెస్ట్ షూట్ కూడా చేశారు. చంద్ర‌బాబు మేన‌రిజమ్స్‌ తో పాటు - ఆయ‌న‌లా గెట‌ప్ వేసుకొని రిహార్స‌ల్స్ చేశాడట రానా.  ఆ గెట‌ప్‌ లో రానా క‌నిపించిన విధానం క్రిష్‌ కి బాగా న‌చ్చింద‌ట‌. గెట‌ప్ ప‌రంగా  మ‌రికొన్ని మెరుగులు దిద్దుకొని రానా త్వ‌ర‌లోనే సెట్స్‌ పైకి వెళ్ల‌నున్న‌ట్టు స‌మాచారం.

సినిమాలో చంద్ర‌బాబుగా రానా మూడు కీల‌క‌మైన స‌న్నివేశాల్లో క‌నిపిస్తాడ‌ట‌. ఆ స‌న్నివేశాల్లో ఒక‌టి పెళ్లి నేప‌థ్యంలో సాగుతుంది. మిగ‌తావి ఎన్టీఆర్‌ తో సాన్నిహిత్యానికి సంబందించిన‌వీ, అలాగే  రాజ‌కీయ వ్య‌వ‌హారాల‌తో పాటు, కుటుంబానికి సంబంధించిన స‌న్నివేశాల్లో రానా క‌నిపించ‌బోతున్నాడు. చంద్ర‌బాబు  మంత్రి అయ్యాకే ఎన్టీఆర్ కుమార్తె భువ‌నేశ్వ‌రిని పెళ్లి చేసుకొన్నారు. అందుకే పెళ్లి నేప‌థ్యంలో స‌న్నివేశాల్ని కాస్త భారీగానే తీయ‌బోతున్నార‌ట‌. అయితే అప్ప‌టివాతావ‌ర‌ణాన్ని ప్ర‌తిబింబించేలాగే ఆ స‌న్నివేశాల్ని తెర‌కెక్కించ‌నున్న‌ట్టు స‌మాచారం. కొన్ని రోజులుగా రానా చంద్ర‌బాబు నాయుడు మేన‌రిజ‌మ్స్‌ పై దృష్టిపెట్టి ప్ర‌త్యేకంగా సిద్ధ‌మ‌వుతున్న‌ట్టు చిత్ర‌వ‌ర్గాలు చెబుతున్నాయి. ఇటీవ‌లే తొలి షెడ్యూల్‌ లో బాల‌కృష్ణ‌ - విద్యాబాల‌న్‌ తో పాటు - ప‌లువురు సీనియ‌ర్ న‌టులు నేపథ్యంలో స‌న్నివేశాలు తీశారు. త‌దుప‌రి షెడ్యూల్ చంద్ర‌బాబు నేప‌థ్యంలోనే సాగ‌బోతోంద‌ని స‌మాచారం. 
Tags:    

Similar News