రానా స్లిమ్మయింది నారా పాత్ర కోసమే!

Update: 2018-08-23 12:52 GMT
'బాహుబలి' కంటే ముందే రానా దగ్గుబాటి హిందీ, తమిళ సినిమాల్లో నటించాడు కానీ భల్లాలదేవ రోల్ మాత్ర ఆయనకు దేశవ్యాప్తంగా భారీ స్థాయిలో గుర్తింపు తెచ్చి పెట్టింది.  తర్వాత 'ఘాజి'.. 'నేనే రాజు నేనే మంత్రి' సినిమాలతో కూడా ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు.  ఈమధ్య రానా హెల్త్ సరిగా లేదని కొన్ని రూమర్స్ వినిపించాయి. పైగా రానా సన్నగా మారడంతో.. కొంతమంది అవి నిజమేమో అని అనుకున్నారు.  కానీ 'ఎన్టీఆర్' సినిమాలో నారా చంద్రబాబు నాయుడు పాత్ర పోషిస్తున్నానని కన్ఫాం చేయడంతో ఆ రూమర్లకు తెరపడింది.

అంతే కాకుండా రానా ఈమధ్య ఒకసారి తనకు కంటికి సంబంధించిన సమస్య మాత్రమే ఉందని - దానికి ట్రీట్ మెంట్ తీసుకుంటున్నానని తెలిపాడు.  దీంతో చంద్రబాబు పాత్ర కోసమే తను సన్నగా మారాడని ఫుల్ క్లారిటీ వచ్చినట్టే.  ఇక రానాను అభిమానించే వారందరికీ ఇది కాస్త ఊరటనిచ్చే విషయమే.  రానా నటన గురించి అందరికీ తెలిసిందే కాబట్టి ఇక నారావారి పాత్రలో కి పరకాయ ప్రవేశం చేయడం ఖాయం.

ఈ సినిమానే కాకుండా హిందీ సినిమా 'హాథి మేరె సాథీ'.. ధనుష్ తమిళ్ ఫిలిం 'ఎనై నోకి పాయుం తోటా'..  మలయాళంలో 'మార్తాండ వర్మ'.. కన్నడలో 'ఎల్టీటీఈ' సినిమాలు కూడా రానాకు లైన్ లో ఉన్నాయి.
Tags:    

Similar News