నిర్మాత అవుతాడని అనుకుంటే హీరో అయ్యాడు. అనూహ్యంగా స్టార్ హీరో రేంజును ఆస్వాధిస్తున్నాడు. ఎవరా యంగ్ హీరో? అంటే దగ్గుబాటి రానా అని టక్కున చెప్పేయొచ్చు. డి.సురేష్ బాబు వారసుడిగా రానా నాలెజ్ గురించి చెప్పాల్సిన పనేలేదు. తాత డా.డి రామానాయుడు బాటలోనే సురేష్ ప్రొడక్షన్స్ బాధ్యతలు నిర్వర్తిస్తాడని భావించారంతా. కానీ అనూహ్యంగా అతడు హీరో అయ్యాడు. 2010లో లీడర్ సినిమాతో హీరోగా కెరీర్ ప్రారంభించిన రానా ఇప్పటికే దశాబ్ధం కెరియర్ ని పూర్తి చేసుకున్నాడు. కెరీర్ లో 30 సినిమాల్లో నటించేశాడు. తెలుగు- తమిళం- హిందీ భాషల్లో రానా పేరు పాపులర్. బాహుబలి సిరీస్ తో దేశ- విదేశాల్లోనూ ఫాలోయింగ్ తెచ్చుకున్నాడు.
నటుడిగా పరిణతి చెందడానికి మూడు నాలుగు సినిమాల సమయం తీసుకున్నా అటుపై మాత్రం రానా వెనుదిరిగి చూసిందే లేదు. ప్రస్తుతం సౌత్ లో మోస్ట్ వాంటెడ్ హీరోగా కెరీర్ ని సాగిస్తున్నాడు. ఇప్పటికిప్పుడు అరడజను ప్రాజెక్టులు క్యూలో ఉన్నాయి. హాతీ మేరే సాథీ చిత్రంతో తెలుగు-తమిళం- హిందీలో తనదైన మార్క్ వేయాలన్న ప్రయత్నంలో ఉన్నాడు. దాంతో పాటే హిరణ్య కసిప చిత్రం క్యూలో ఉంది. ఈ సినిమాకి సంబంధించిన వర్క్ ని గుణశేఖర్ సీరియస్ గా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇది యూనివర్శల్ అప్పీల్ తో అలరించే విజువల్ గ్రాఫిక్స్ బేస్డ్ సినిమా. పురాణేతిహాసాన్ని ఎంచుకుని రానాని నటుడిగా మరో లెవల్లో చూపించే ప్రయత్నమే సాగుతోంది. మడై తిరంతు (1945) తెలుగు- తమిళ్ ద్విభాషా చిత్రంగా తెరకెక్కుతోంది. రానా కామియో చేస్తున్న ఎన్నయ్ నోకి పాయుం.. తమిళ చిత్రం అండర్ ప్రొడక్షన్ ఉంది.
ఇక వీటితో పాటు కిలాడీ అక్షయ్ కుమార్ నటిస్తున్న క్రేజీ ఫ్రాంఛైజీ హౌస్ ఫుల్ 4లోనూ నటిస్తున్నాడు. ఈ సినిమాలతో పాటు రానా హీరోగా కెరీర్ 31 వ సినిమా నేడు ప్రారంభమవుతోంది. రానా- సాయిపల్లవి హీరో హీరోయిన్ లుగా వేణు ఉడుగుల దర్శకత్వంలో `విరాటపర్వం` పూజా కార్యక్రమాలతో ప్రారంభమవుతోంది. ప్రారంభానికి ముందే ఈ సినిమా కథాంశం పై ఆసక్తికర చర్చ సాగుతోంది. ఎమర్జెన్సీ నేపథ్యంలో తెరకెక్కుతున్న చిత్రమిది. అలాగే పలు భాషలకు చెందిన ప్రముఖ నటీనటుల్ని ఎంపిక చేస్తుండడం ఆసక్తిని పెంచుతోంది. టైటిల్ కి తగ్గట్టే అడవుల్లోనే నాయకానాయికల జీవితం క్షణక్షణం టెన్షన్ తో సాగుతుందట. రానా- సాయి పల్లవి ఈ చిత్రంలో నక్సలైట్లుగా కనిపించనున్నారని తెలుస్తోంది. ఇక ఈ చిత్రంలో మానవ హక్కుల కోసం పోరాటం చేసే మధ్య వయసు మహిళ పాత్రలో టబు నటించనుందని ఇదివరకూ వార్తలొచ్చాయి. మరో కీలక పాత్రకు ప్రియమణిని ఎంపిక చేసుకున్నారు. బాలీవుడ్ విలక్షణ నటుడు నానా పటేకర్ పాత్ర ఆసక్తిని రేకెత్తిస్తుందట. నేడు రామానాయుడు స్టూడియోస్ లో ఎలాంటి మీడియా హడావుడి లేకుండా లో సినిమాని ప్రారంభిస్తున్నారని తెలుస్తోంది.